కవిత అరెస్టు వేళ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం-కేజ్రివాల్ కు ఊరట..!
దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సీఎం అరవింద్ కేజ్రివాల్ కు ఈడీ నోటీసుల మీద నోటీసులు పంపుతున్నా ఆయన మాత్రం ఏవో కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఇదే క్రమంలో లిక్కర్ కేసు విచారణకు ఆయన సహకరించడం లేదని ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రివాల్ కు బెయిల్ ఇచ్చింది.
లక్ష పూచీకత్తుతో పాటు 15 వేల వ్యక్తిగత బాండ్ చెల్లించి బెయిల్ తీసుకోవచ్చని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు సూచించింది. దీంతో లిక్కర్ స్కాంలో ఎన్నికల వేళ అరెస్టు నుంచి కేజ్రివాల్ కు ఊరట లభించినట్లయింది. మరోవైపు ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ నేత కవితను నిన్న హైదరాబాద్ లో అరెస్టు చేసిన పోలీసులు ఢిల్లీ తరలించారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత ఆమెను ఇదే రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు.

లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితురాలిగా ఉన్న కవితను కస్టడీకి కోరాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆమె ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నారు. అయితే రౌస్ అవెన్యూ కోర్టులో కేసు పెండింగ్ ల ఉండగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇవాళ కేజ్రివాల్ కు బెయిల్ లభించిన నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టు కూడా రౌస్ అవెన్యూ కోర్టులోనే తేల్చుకోవాలని సూచిస్తే ఇక్కడ ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా!












Click it and Unblock the Notifications