కేజ్రీవాల్ నక్సలైట్, 420 ఏమైనా మాట్లాడ్తాడు: స్వామి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి బుధవారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏఏపీ నేత అరవింద్ కేజ్రీవాల్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతి వ్యతిరేకులకు మద్దతిస్తున్నందున కేజ్రీవాల్ ఓ నక్సలైట్ అని ధ్వజమెత్తారు.
అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ.. తదితరులు బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కేజ్రీవాల్ ఓ నక్సలైట్ అని విమర్శించారు. ఆయన తన ఇష్టం వచ్చినట్లు ఎప్పుడైనా, ఎక్కడైనా మాట్లాడగలడన్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు విచిత్రంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్ పట్ల మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే, ఎందుకు కఠినంగా వ్యవహరిస్తున్నారని కేజ్రీవాల్ అడుగుతారని, అదే సాఫ్టుగా ఉంటే, అలా ఎందుకు ఉన్నారని అడుగుతారని ఎద్దేవా చేశారు. ఆయన ఓ 420 అని ధ్వజమెత్తారు. అలాంటి నేతల వ్యాఖ్యలను ఎలా సీరియస్‌గా తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications