కేజ్రివాల్ ఘాజీపూర్ పర్యటన ఉద్రిక్తం-ఆప్ వర్సెస్ బీజేపీ నిరసనలు, దాడులు
ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్తర్ ప్రదేశ్ పరిధిలోకి వచ్చే ఘాజీపూర్ ల్యాండ్ ఫిల్లింగ్ సైట్ (చెత్త డంపింగ్ యార్డ్)లో భారీగా చెత్త పేరుకుపోయినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఇవాళ అక్కడ పర్యటించారు. అయితే కేజ్రివాల్ పర్యటనను నిరసిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది.
ఘాజీపూర్ చెత్త డంపింగ్ యార్డ్ కు కేజ్రివాల్ వస్తున్నారని తెలియడంతో బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ఘాజీపూర్ కు చేరుకున్న కేజ్రివాల్.. తనకోసం వేచి చూస్తున్న బీజేపీ కార్యకర్తల్నిఉద్దేశించి బీజేపీ ఢిల్లీకి ఏమిచ్చింది ? చెత్త పర్వతాలు తప్ప అని వ్యాఖ్యానించారు. ఈసారికి మీ పార్టీని వదిలిపెట్టి ఆప్ కు ఓటేయాలని సూచించారు. త్వరలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రివాల్ చెత్త డంపింగ్ యార్డ్ కు వచ్చి బీజేపీని టార్గెట్ చేయడంతో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి.

అప్పటికే కేజ్రివాల్ టూర్ కోసం ఘాజీపూర్ చేరుకున్న బీజేపీ, ఆప్ కార్యకర్తలు పరస్పరం నిరసనలకు దిగారు. దాడులు చేసుకున్నారు. కేజ్రివాల్ పర్యటనకు ముందే బీజేపీ కార్యకర్తలు నల్లజెండాలు చేతబూని నినాదాలు చేశారు. ఆప్ కార్యకర్తలు బిజెపికి వ్యతిరేకంగా నినాదాలతో ప్రతిఘటించారు. మూడు ముక్కలుగా ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషనన్ ని కేంద్రం తాజాగా ఒకే సంస్ధగా మార్చింది. దీనికి ఈ ఏడాది చివరి నాటికి లేదా 2023 ప్రారంభంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
బిజెపి నిరసనలను అశాస్త్రీయమని కేజ్రివాల్ విమర్శించారు. తాను ఢిల్లీలోని వృద్ధులను ఉచిత తీర్థయాత్రలకు పంపానని, తన తల్లిదండ్రులను పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లడంలో ప్రసిద్ధి చెందిన రామాయణ వీరుడు ఢిల్లీకి చెందిన శ్రవణ్ కుమార్ అని తనను తాను కేజ్రివాల్ అభివర్ణించుకున్నారు. ఈ ఒక్క సారి బీజేపీ ఓటర్లు పార్టీల బేధాలు మర్చిపోవాలని కోరుతున్నానన్నారు. ఢిల్లీని శుభ్రం చేస్తామని వెల్లడించారు. మిమ్మల్ని తీర్థయాత్రలకు తీసుకెళ్లిన మీ కొడుక్కి ఓటు వేయండని ఢిల్లీలోని తల్లులకు కేజ్రివాల్ కోరారు.
मैं दिल्ली के लोगों से, अपनी माताओं- बहनों और बुजुर्गों से पूछना चाहता हूं:
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 27, 2022
तुम्हारे बेटे ने अच्छे स्कूल-अस्पताल बनाए, बुज़ुर्गों को तीर्थ यात्रा कराई।
ये लोग यहाँ आकर तुम्हारे बेटे को गालियां देते हैं। क्या आप लोग ये गालियां बर्दाश्त करोगे? pic.twitter.com/3VVIZ6R2BJ












Click it and Unblock the Notifications