దూసుకెళ్తున్న కేజ్రివాల్: మోడీ తర్వాత అతనే!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత స్థానాన్ని దక్కించుకున్నారు. అదేదో రాజకీయ పరంగానో, పాలనా పరంగానో కాదు, ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్యలో.
మనదేశంలో ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన రెండో రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. బుధవారం రాత్రికి ట్విట్టర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 60 లక్షలకు చేరింది. ట్విట్టర్‌లో 60 లక్షల మార్క్‌ను కేజ్రీవాల్ దాటారని 'ఆప్' సోషల్ మీడియా చీఫ్ అంకిత్ లాల్ వెల్లడించారు.

కాగా, ట్విట్టర్‌లో కేజ్రీవాల్ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ముందున్నారు. ఆయనను 1.6 కోట్ల మంది అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాను విరివిరివిగా వాడే రాజకీయ నాయకుల్లో వీరిద్దరూ అగ్రస్థానంలో ఉన్నారు. ట్విటర్‌లో ఎక్కువ మంది పాలోవర్లు కలిగిన రాజకీయ నాయకుల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా ఉన్నారు.
ఆయనకు 35 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సెలబ్రిటీల ట్విట్టర్ జాబితాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ 1.7కోట్ల ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications