Arvind Kejriwal: సుప్రీంకోర్టులో నేడు ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎదురుదెబ్బ!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడి అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురవుతుంది. తాజాగా నేడు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఈడీ తనను అరెస్ట్ చేయటాన్ని సవాల్ చేస్తూ అత్యవసరంగా తన పిటిషన్ ను విచారించాలని కోరిన అరవింద్ కేజ్రివాల్ పిటిషన్ సుప్రీంకోర్టు నేడు విచారణకు తీసుకోలేదు.
సుప్రీం కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ కు చేదు అనుభవం
సుప్రీంకోర్టులో నేడు ఈడి అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్ధించటాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ అత్యవసర విచారణ జరపాలని ఆయన న్యాయవాదులు సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. నిన్నటి ఢిల్లీ హైకోర్టు తీర్పుపై తాను వేసిన సవాల్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టక పోవడంతో అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చేదు అనుభవం ఎదురైంది.

సోమవారం వరకు ఆగాల్సిందే
ఇక రేపటి నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు ఉండడంతో, వచ్చే సోమవారం వరకు ఆయన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం లేదు.
దేశ అత్యున్నత న్యాయస్థానం వచ్చే సోమవారం సెలవుల అనంతరం తెరవబడుతుంది. వచ్చే సోమవారం ఆయన పిటిషన్ సుప్రీం ధర్మాసనం ముందుకు వస్తుందని భావిస్తున్నారు.
కేజ్రీవాల్ అత్యవసర అప్పీల్ కు ప్రాధాన్యత ఇవ్వని సుప్రీం
అరవింద్ కేజ్రివాల్ తన అప్పీల్ పై అత్యవసర విచారణ కోసం సుప్రీంకోర్టు ఎటువంటి ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేయలేదని తాజా పరిణామాలతో తెలుస్తుంది. ఆయన అత్యవసర అప్పీల్ కు సుప్రీం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. సుప్రీంకోర్టు క్యాలెండర్ ప్రకారం ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ పండుగ కోసం గురువారం కోర్టుకు సెలవు ప్రకటించబడింది.
వరుస సెలవులతో సుప్రీం కోర్టు బంద్.. కేజ్రీవాల్ పిటీషన్ పై నిర్ణయం అప్పుడే
ఆ పై శుక్రవారం స్థానిక సెలవు దినం కాగా, శని, ఆదివారాలు వారాంతపు సెలవు దినాలు. దీంతో సోమవారం తిరిగి కోర్టు తెరవబడుతుంది. అప్పుడే అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో నిరీక్షించవలసిందే.












Click it and Unblock the Notifications