Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీహార్ కొత్త సీఎంగా, మోదీ మాస్టర్ ప్లాన్ - నితీశ్ వాట్ నెక్స్ట్..!?

బీహార్ లో ఎన్డీఏ కొత్త రికార్డు నెలకొల్పింది. ఏకపక్షంగా బీహార్ లో అధికారం చేపట్టింది. హోరా హోరీ పోరు ఖాయమనే సర్వే సంస్థల అంచనాలు తల కిందులయ్యాయి. ఎన్డీఏ కూటమి దాదాపు 200 సీట్ల మార్క్ కు చేరువైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరోసారి అధికారం నిలబెట్టాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చిరునామా గల్లంతు అయింది. మరి.. ఇప్పుడు బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు. నితీశ్ కొనసాగుతారా. లెక్కలు మారుతాయా. బీజేపీ ఆలోచన ఏంటి. ఏం జరిగే అవకాశం ఉంది.

బీహార్ లో మరో సారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బీహార్ ప్రజలు ఏకపక్షంగా ఎన్డీఏ కు పట్టం కట్టారు. ఇప్పటికే 194 సీట్లలో స్పష్టమైన ఆధిక్యతలో ఉన్న ఎన్డీఏ 200 సీట్లు గెలుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాఘట్ బంధన్ 44 స్థానాలకే పరిమితం కాగా, మరో అయిదు స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రధాని మోదీ - నితీశ్ ప్రచారం.. పథ కాలు ప్రజలను వారి వైపు నిలబెట్టాయి. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. బీజేపీ - 87 స్థానాలు.. జేడీయూ - 76 సీట్లు గెలవటం ఖాయంగా కనిపిస్తోంది. మహిళలు.. యువత మద్దతు ఎన్డీఏ కే దక్కినట్లు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. ఇక.. ఇప్పుడు ఎన్డీఏ నుంచి కాబోయే సీఎం ఎవరు. మరోసారి నితీశ్ కే అవకాశం దక్కుతుందా.. బీజేపీ మార్క్ రాజకీయం తెర మీదకు వస్తుందా అనేది జాతీయ స్థాయిలో కీలక అంశంగా మారుతోంది.

As the NDA is all set to form the government in Bihar who will be the new CM

నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగుతారా అనే అంశం పైన బీజేపీ నేతలు ప్రచారం నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేదు. ఫలితాలు వచ్చాక నిర్ణయిస్తామని తెలిపింది. కానీ బిహార్‌కుఅత్య‌ధిక కాలం సీఎంగా సేవలు అందించిన 74 ఏళ్ల‌ నితీశ్ కుమార్‌కు మ‌రో ఛాన్స్ ఇవ్వకూడదని బీజేపీ వర్గాలు అనుకుంటున్నాయి. ఎన్డీఏ కూట‌మిలోని భాగ‌స్వామ్య పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే లు ముందుగా తమ తమ పార్టీ నాయకులను ఎన్నుకుంటారు. తర్వాత‌ వారు కలిసి కూర్చుని తదుపరి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయిస్తారు అని హోంమంత్రి అమిత్ షా ఒకసారి చెప్పారు. బీజేపీ మెజార్టీ సీట్లు సాధిస్తే ఆ పార్టీ నుంచే సీఎం అభ్యర్ధి ఉండేలా కాషాయం పార్టీ నేతలు వ్యూహాలు సిద్దం చేసారు. అయితే, బీజేపీతో సమానంగా నితీశ్ పార్టీ స్థానాలను గెలుచు కోవటంతో ఇప్పుడు అసలు లెక్క మొదలైంది. మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయం ఇప్పుడు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు బీహార్ లో బీజేపీ ఎలాంటి రాజకీయం చేసినా.. ఇండియా కూటమికి అవకాశం గా మారే ఛాన్స్ ఉంది. ఇదే సమయం లో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు అంత సులభమైన అంశం కాదు. దీంతో.. నితీశ్ కే మరోసారి బీజేపీ ముఖ్యమంత్రిగా మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే వాదన ఉంది. అయితే, బీహార్ లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి సామాజిక లెక్కలు.. స్పీడ్ గవర్నెన్స్ అందించేలా నితీశ్ స్థానంలో యువ నేతకు బాధ్యతలు అప్పగించి.. నితీశ్ కు కేంద్రంలో కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంద నే చర్చ మొదలైంది. అయితే.. నితీశ్ తనకు సీఎం పదవి కాకుండా మరేదీ అంగీకరించే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో.. రేపు నితీశ్ ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ సూత్రప్రాయంగా జరిగే చర్చ ల్లో ముఖ్యమంత్రి ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నితీశ్ తానే సీఎం గా ఉంటానని పట్టు బడితే బీజేపీ మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరి.. ఇప్పుడు బీహార్ సీఎం ఖరారు లో మోదీ మార్క్ రాజకీయం ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+