ఇండియా కూటమి చేతిలో ఘోర అవమానం- ఓవైసీ కీలక నిర్ణయం..!
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో సెక్యులర్ పార్టీలను కలుపుకోకుండా పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి వారి అవకాశాల్ని దెబ్బతీసి బీజేపీకి పరోక్షంగా ప్రయోజనం చేసిన ఆయనకు ఇప్పుడు బీహార్ లో భారీ షాక్ తగిలింది. తమ పార్టీని కలుపుకోవాలని కోరుతూ బీహార్ లో ఇండియా కూటమి చుట్టూ కొంతకాలంగా తిరుగుతున్న ఆయనకు తిరస్కారం ఎదురైంది.
బీహార్ అసెంబ్లీలో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ దశలో అధికార ఎన్డీయే కూటమిపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఇండియా కూటమికి గెలుపు అవకాశాలు ఉండొచ్చన్న అంచనాల మధ్య గతంలో వారిని వదిలి వెళ్లిపోయిన మిత్రపక్షాలు తిరిగి వస్తున్నాయి. అదే సమయంలో తామూ ఇండియా కూటమితో కలిపి పోటీ చేస్తే ఎన్నో కొన్ని సీట్లు గెల్చుకోవచ్చని ఓవైసీ కూడా భావించారు. దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే అక్కడ వాలిపోయారు.

బీహార్ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి పోటీ చేసేందుకు సిద్దమని, తమకు ఆరు సీట్లు కేటాయించాలని కోరుతూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు లేఖలు రాశారు. అయితే ఎంఐఎం లేఖల్ని ఆయన పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో తెలియక మథన పడుతున్న ఓవైసీ ఇవాళ ఓ నిర్ణయానికి వచ్చేశారు. బీహార్ లో ఇండియా కూటమికి బుద్ధి చెప్పేందుకు ఏకంగా 100 సీట్లలో ఎంఐఎం పోటీ చేస్తున్నట్లు ఓవైసీ ప్రకటించారు.

100 సీట్లలో పోటీ చేయాలనేది తమ ప్రణాళిక అని, ఎన్డీయే, ఇండియా కూటమి రెండూ తమ ఉనికిని తెలుసుకుంటాయని ఓవైసీ చెప్పుకొచ్చారు. 2020లో ఎంఐఎం లౌకిక ఓట్లను చీల్చిందని ఆరోపించిన ఇండియా కూటమి ఇకపై అలా చెప్పుకోలేదన్నారు. తాను పొత్తు కోసం ఆర్జేడీ నేతలు లాలూ యాదవ్, తేజస్వికి లేఖలు రాశానని, అయినా వారి నుంచి స్పందన రాలేదని ఓవైసీ తెలిపారు. ఇప్పుడు తమ అడుగులు విస్తరించడానికి తాము చేయగలిగినదంతా చేయాలన్నారు. తృతీయ ఫ్రంట్ కు అవకాశాలు పెంచుకోవడానికి తాము భావసారూప్య పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications