ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి ఖాళీగా న్యూయార్క్ వెళ్లిన యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం, ఎందుకంటే.?
న్యూఢిల్లీ: అమెరికా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న యూనైటెడ్ ఎయిర్‌లైన్ విమానం.. ఇక్కడ ప్రయాణికులెవరినీ ఎక్కించుకోకుండానే ఖాళీగానే తిరిగి న్యూయార్క్ నగరానికి వెళ్లిపోయింది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత విమాన సిబ్బందిని కరోనా పరీక్షలు చేసుకోవాలని కోరడంతో వారు నిరాకరించారు.
ఆ తర్వాత ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులెవరినీ విమానంలో ఎక్కించుకోకుండానే ఖాళీగా న్యూయార్క్ నగరానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు విమానాలు తిరగవని పేర్కొంది.

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో.. 'మేము భారతదేశానికి ప్రయాణ అవసరాలకు సంబంధించి స్పష్టత కోరినప్పుడు... మేము సేవలను తాత్కాలికంగా నిలిపివేశాము. మేము మా వినియోగదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను అందించడానికి కృషి చేస్తున్నాము, వీలైనంత త్వరగా మా షెడ్యూల్ సేవలను తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము' అని పేర్కొంది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమానాల్లో వచ్చే ఇతర దేశాల సిబ్బందికి కరోనా పరీక్షలను చేయడం మినహాయింపు ఇచ్చింది. అయితే, వారు విమానం నుంచి బయటకు రాకుండా ఉంటేనే ఈ మినహాయింపు వర్తిస్తుంది. అయితే, యూనైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలోని సిబ్బంది విమానాశ్రయంలోనికి వచ్చేందుకు ప్రయత్నించడంతో వారిని కరోనా పరీక్షలు చేసుకోవాలని విమానాశ్రయంలోని అధికారులు కోరారు.
అయితే, వారు టెస్టులకు నిరాకరించి వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే, విమానం ఖాళీగా వెనుదిరగడంపై సదరు విమానయాన సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఢిల్లీ విమానాశ్రయ అధికారులతో చర్చల ప్రభావం కారణంగానే యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు విమానంలోని ఓ ప్రయాణికుడు మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications