కాంగ్రెస్‌కు పాకిస్తాన్ సాయం? మలుపు తిరిగిన అస్సాం రాజకీయం

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి పాకిస్థాన్ రాజకీయాల వరకు వెళ్ళింది. కాంగ్రెస్ అభ్యర్థులకు, ముఖ్యంగా గౌరవ్ గొగోయ్‌కు పాకిస్థాన్ మద్దతు ఉందంటూ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి.

అస్సాం ఎన్నికలను పాకిస్థాన్ ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. "గౌరవ్ గొగోయ్‌కు పాకిస్థాన్ ఎందుకు సాయం చేస్తోంది? మీరు పాకిస్థాన్ సోషల్ మీడియా గ్రూపుల సాయం ఎందుకు తీసుకుంటున్నారు? ఆ దేశంతో మీకున్న రహస్య బంధాన్ని ఎందుకు వెల్లడించరు?" అని ఆయన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ తన విలేకరుల సమావేశాల్లో ప్రదర్శించిన సమాచారమంతా పాకిస్థాన్ నుంచి సరఫరా అయ్యిందని, దీని వెనుక దేశ వ్యతిరేక శక్తుల హస్తం ఉందన్నది ఆయన ప్రధాన ఆరోపణ.

Assam CM Himanta Claims Congress Taking Help from Pakistan for 2026 Elections to Influence Voters

ఏఐ ఫోటోషాప్ కుట్ర.. న్యాయపోరాటానికి సిద్ధం!

తన భార్య రినికి భూయాన్ శర్మకు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను సీఎం తోసిపుచ్చారు. పాకిస్థానీ సోషల్ మీడియా గ్రూపులు అందించిన ఫోటోలను ఏఐ (AI) ఫోటోషాప్ ద్వారా మార్చి, నకిలీ పత్రాలను సృష్టించారని ఆయన ధ్వజమెత్తారు. "నా భార్యపై చేసిన ఈ తప్పుడు ఆరోపణలన్నింటిపైనా మేము కోర్టుకు వెళ్తాము. మోసపూరిత పత్రాలతో ప్రజల తీర్పును ప్రభావితం చేయడం తీవ్రమైన నేరం" అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పవన్ ఖేరాపై తన భార్య ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఎన్నికల వేళ 'పాక్' అస్త్రం.. ఉత్కంఠలో అస్సాం!

గత పది రోజులుగా పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఛానెళ్లు అస్సాం ఎన్నికలపై 11కు పైగా చర్చా కార్యక్రమాలు నిర్వహించడం వెనుక లోతైన కుట్ర ఉందని సీఎం అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి చర్చా కార్యక్రమంలోనూ కాంగ్రెస్ గెలవాలని ముగించడం గమనార్హమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ, తన భార్య విదేశీ ఆస్తులపై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని ఎదురుదాడికి దిగారు. ఈ 'పాస్-పోర్ట్' మరియు 'పాకిస్థాన్' వివాదం అస్సాం ఎన్నికల ఫలితాలను ఏ మలుపు తిప్పుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

హిమంతను వదిలిపెట్టం.. 15 ఏళ్లు జైలుకే!

ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఆదివారం అస్సాంలోని బిశ్వనాథ్, గోలాఘాట్, జోర్హాట్ జిల్లాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో పాల్గొని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై నిప్పులు చెరిగారు. అస్సాంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిమంతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఆయన క్షమాపణ చెప్పినా వదిలిపెట్టబోమని భీష్మించుకున్నారు. "హిమంతను కనీసం 10 నుంచి 15 ఏళ్ల పాటు జైల్లో ఉంచేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది" అని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షాల అండతో హిమంత అస్సాంను బడా పారిశ్రామికవేత్తలకు 'ల్యాండ్ ఏటీఎం' లా మార్చేశారని, ఇక్కడి ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+