బహుభార్యత్వం నిషేధం దిశగా ఆ బీజేపీ పాలిత రాష్ట్రం- హింట్ ఇచ్చేసిన సీఎం..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతితో పాటు పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ..తాము అధికారంలో ఉన్న మరో రాష్ట్రంలో ఇంకో వివాదాస్పద నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చాక ఈ నిర్ణయం అమలు చేస్తామని కూడా ప్రకటించేసింది. దేశంలో ఎన్నార్సీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న ఈ రాష్ట్రంలోనే ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం కూడా అమలు కాబోతోంది.
అసోంలో బహుభార్యత్వంపై నిషేధం విధించేందుకు అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో బహుభార్యత్వంపై నిషేధం విధించడం సాధ్యమైతే తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన అంశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అనే దానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుంది.

రాష్ట్రంలో బహుభార్యాత్వాన్ని నిషేధించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందో లేదో పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25లోని ముస్లిం పర్సనల్ లా (షరియత్) చట్టం 1937లోని నిబంధనలను పరిశీలిస్తుంది. ఈ కమిటీ న్యాయ నిపుణులతో సహా ఈ వ్యవహారంతో ముడిపడిన అందరితోనూ విస్తృతంగా చర్చించి ఓ నిర్ణయానికి వస్తుందని సీఎం హిమంత తెలిపారు.
The Assam Government has decided to form an expert committee to examine whether the state Legislature is empowered to prohibit polygamy in the state. The committee will examine the provisions of The Muslim Personal Law (Shariat) Act, 1937 read with Article 25 of the Constitution…
— Himanta Biswa Sarma (@himantabiswa) May 9, 2023
ముస్లింలలో బహుభార్యత్వం, నికాహ్ హలాలా ఆచారం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అసోంలో బీజేపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం సిద్ధమవుతున్న బీజేపీ ఇందులో భాగంగానే ముందుగా అసోంలో బహుభార్యత్వం రద్దు కోసం చట్టం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications