వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛానల్లో షార్ట్స్ ధరించే యువతుల్ని కోతులతో పోల్చారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

దిస్పూర్: యువతులు షార్ట్స్ వేసుకోవడాన్ని అసోంకు చెందిన ఓ టీవీ ఛానల్ కోతులతో పోల్చింది. ఇది పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీస్తోంది.

అసోంకు చెందిన టీవీ ఛానల్ ఒకటి ఇటీవల ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. అందులో యువతులు షార్ట్స్ ధరించడాన్ని కోతులతో పోల్చింది. దీనిపై ఈశాన్య రాష్ట్రాలలోని ప్రజలు భగ్గుమంటున్నారు. పోలీసుల కంటే మీడియాను చూసి భయపడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోతులు బట్టలు ధరించడం మొదలు పెడితే.. వాటిని అవి ఎలా ఉతుక్కుంటాయి... కానీ గౌహతిలోని యువతులు మాత్రం తమ సౌకర్యం కోసం షార్ట్స్ ఎంచుకుంటారని సదరు టీవీ ఛానల్ కార్యక్రమంలో వచ్చింది. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Assam TV Channel Equates Young Girls Wearing Shorts to Monkeys, Triggers Uproar

ఈ కార్యక్రమంలో సదరు టీవీ ఛానల్ షార్ట్స్, టీ షర్ట్స్ ధరించి నగరంలో తిరుగుతున్న యువతులను చూపించింది. దీనికి నిరసనంగా ఆదివారం గౌహతి నగరంలో పలువురు ఆందోళనకు దిగారు.

టీవీ ఛానల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పరిస్థితి ఆందోళనగా ఉండటంతో కర్ఫ్యూ విధించారు. కాగా, దీని పైన సదరు టీవీ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఫేస్‌బుక్ ద్వారా క్షమాపణలు చెప్పారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు.

English summary
A news clip aired by an Assamese news channel, which went viral on social media, has equated young girls wearing shorts to monkeys, giving rise to a heated debate in civil society in the northeastern state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X