రాజ్‌నాధ్ పరామర్శ, తృటిలో తప్పిన ప్రమాదం... 79కి చేరిన మృతులు (ఫోటోలు)

న్యూఢిల్లీ: అస్సాంలోని సోనిట్‌పూర్. కోక్రాఝర్ జిల్లాల్లో ఎన్టీఎఫ్‌బీ(ఎస్) తీవ్రవాదుల మారణకాండలో మృతుల సంఖ్య 79కి చేరింది. దీంతో ఇంకా అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఈ హింసాకాండ ఉడాల్ గురి జిల్లాకు వ్యాపించింది.

ఎన్టీఎఫ్‌బీ(ఎస్) సంస్ధకు చెందిన తీవ్రవాదులు ఉడాల్ గురి జిల్లాలోని కొన్ని గ్రామాలపై బుధవారం రాత్రి దాడులకు పాల్పడ్డారు. ఇళ్లను తగులబెట్టారు. గ్రామస్తులపై కాల్పులు జరిపారు. వారిని నియంత్రించడానికి పోలీసులు కూడా కాల్పులకు పాల్పడ్డారు. ఆ ఘటనలో ఒక ఆదివాసీ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

అస్సాంలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఉదయం బోడో సెటిల్మెంట్ గ్రామాలపై ఆదివాసీలు దాడులు చేసారు. ఆ దాడుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

పరిస్ధితిని సమీక్షించిన హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్

అస్సాంలో బోడో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాద్ సింగ్ గురువారం ఉదయం సోనిట్‌పూర్ జిల్లాలో పర్యటిస్తూ పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. బుధవారం రాత్రే అస్సాంకు చేరుకున్న హోం మంత్రి బోడో తీవ్రవాదుల చర్యను హింసాత్మక చర్యగా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్‌తో కలిసి గురువారం ఉదయం బాధిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి రాజకీయనేతలతోనూ, స్వచ్చంద, సామాజిక సంస్ధలవారితోనూ ఆయన చర్చలు జరిపారు. బిశ్వనాథ్ చరియాలిలోని సర్కూట్ హౌస్ లో ఆయన ఆదివాసి ప్రతినిధులతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ వారితో బోడో తీవ్రవాదులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు. పోలీస్, పారామిలటరీతో పాటు ఆర్మీని కూడా రంగంలోకి దింపుతామని ప్రకటించారు.

దాడి నేపథ్యంలో అస్సాం పోలీసులు బోడోలపై ఉక్కుపాదం మోపగా, రాష్ట్ర బలగాలకు మరింత దన్నుగా నిలిచేందుకు కేంద్రం అదనపు బలగాలను అస్సాంకు పంపింది. 5 వేల మంది పారామిలిటరీ బలగాలను అసోంకు పంపిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

అస్సాంలో బోడో తీవ్రవాదుల మారణహోమంపై నిరిసనలు వెల్లువెత్తున్నాయి. అస్సాం ముఖ్యమంత్రితో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.

రాజ్‌నాధ్ సింగ్‌కు తప్పిన ప్రమాదం

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు ప్రమాదం తృటిలో తప్పింది. అస్సాంలోని బోడో తీవ్రవాదులు, గిరిజనులకు మధ్య ఘర్షణతో ఉద్రిక్తత తలెత్తిన ప్రాంతాలను ఆయన పరామర్శిస్తున్నారు. పర్యటనకు వెళ్లిన ఆయన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో అసోంలోని తేజ్ పూర్ ప్రాంతంలో రాజ్‌నాధ్ బృందం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించారు. హెలికాప్టర్‌‌లో తలెత్తిన లోపాన్ని పైలట్ గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

 అస్సాం బాధిత కుటుంబాలకు రాజ్‌నాధ్ పరామర్శ

అస్సాం బాధిత కుటుంబాలకు రాజ్‌నాధ్ పరామర్శ

అస్సాంలో బోడో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాద్ సింగ్ గురువారం ఉదయం సోనిట్‌పూర్ జిల్లాలో పర్యటిస్తూ పరిస్ధితిన సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్‌తో కలిసి గురువారం ఉదయం బాధిత కుటుంబాలను పరామర్శించారు.

 అస్సాం బాధిత కుటుంబాలకు రాజ్‌నాధ్ పరామర్శ

అస్సాం బాధిత కుటుంబాలకు రాజ్‌నాధ్ పరామర్శ

ఈ సందర్భంగా రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ వారితో బోడో తీవ్రవాదులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు. పోలీస్, పారామిలటరీతో పాటు ఆర్మీని కూడా రంగంలోకి దింపుతామని ప్రకటించారు.

 అస్సాం బాధిత కుటుంబాలకు రాజ్‌నాధ్ పరామర్శ

అస్సాం బాధిత కుటుంబాలకు రాజ్‌నాధ్ పరామర్శ

ఎన్టీఎఫ్‌బీ(ఎస్) సంస్ధకు చెందిన తీవ్రవాదులు ఉడాల్ గురి జిల్లాలోని కొన్ని గ్రామాలపై బుధవారం రాత్రి దాడులకు పాల్పడ్డారు. ఇళ్లను తగులబెట్టారు. గ్రామస్తులపై కాల్పులు జరిపారు.

 అస్సాం బాధిత కుటుంబాలకు రాజ్‌నాధ్ పరామర్శ

అస్సాం బాధిత కుటుంబాలకు రాజ్‌నాధ్ పరామర్శ

అస్సాంలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అస్సాంలో బోడో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో మహిళలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న భద్రతా బలగాలు.

 అస్సాం బాధిత కుటుంబాలకు రాజ్‌నాధ్ పరామర్శ

అస్సాం బాధిత కుటుంబాలకు రాజ్‌నాధ్ పరామర్శ

అస్సాంలో బోడో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో రోదిస్తున్న ఓ మహిళ. ఈ ఘటనలో ఇప్పటి వరకు 79 మృతి చెందారు.

అస్సాం బాధిత కుటుంబాలకు రాజ్‌నాధ్ పరామర్శ

అస్సాం బాధిత కుటుంబాలకు రాజ్‌నాధ్ పరామర్శ

గురువారం ఉదయం బోడో సెటిల్మెంట్ గ్రామాలపై ఆదివాసీలు దాడులు చేసారు. ఆ దాడుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. వారిని నియంత్రించడానికి పోలీసులు కూడా కాల్పులకు పాల్పడ్డారు. ఆ ఘటనలో ఒక ఆదివాసీ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+