హ్యాపీగా ఉన్నాం: 'కాంగ్రెసేతర పక్షాల గెలుపు మాకెప్పుడూ ఆనందమే'
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు మంచి సంతృప్తిని కలిగించాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల అనంతరం గురువారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీకి మద్దతుగా నిలిచినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తాము చేస్తున్న 'కాంగ్రెస్ లేని భారత్' ప్రచారానికి మరో రెండు అడుగులు ముందుకు పడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. అసోంలో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి బీజేపీకి మద్దతిచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రం అసోంలో విజయం సాధించడం అన్నివిధాలా తమకెంతో కీలకమని అన్నారు.

అసోం అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గెలిచిన అభ్యర్థులకు ఈ సందర్భంగా అమిత్ షా అభినందనలు తెలిపారు. కేరళలో సీట్లను గెలుచుకోవడంలో విఫలమైనా, తమకు పడ్డ ఓట్ల విషయంలో 200 శాతం విజయం సాధించామని తెలిపారు. 2011 ఎన్నికల్లో 5 శాతం ఓట్లకు పరిమితమైన తమ పార్టీ, ఈ ఎన్నికల్లో 15 శాతం ఓట్లను పొందిందన్నారు.
చాలా అసెంబ్లీ స్ధానాల్లో గెలుపొందిన అభ్యర్ధులకు గట్టి పోటీ ఇచ్చిందన్నారు. కాగా పుదుచ్చేరి, తమిళనాడు తమ ఓటు బ్యాంకును నిలబెట్టుకున్నామన్నారు. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటూ, ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.
ప్రధాని మోడీ రెండేళ్ల పాలనపై ప్రజలిచ్చిన తీర్పుగా అసోం విజయాన్ని భావిస్తున్నామన్నారు. మరోవైపు తెలంగాణ, ఏపీలో బీజేపీ బలోపేతంపై దృష్టిపెట్టనున్నట్లు అమిత్ షా చెప్పారు. ఇదిలా ఉంటే కాంగ్రెసేతర పక్షాల గెలుపు మాకెప్పుడూ ఆనందమేనని ఆయన చెప్పుకొచ్చారు.
Guwahati: BJP workers celebrate party's victory in Assam #Election2016 pic.twitter.com/5JYPmHxxjO
— ANI (@ANI_news) 19 May 2016












Click it and Unblock the Notifications