హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - ఈ ప్రాంతాల్లో కొత్త స్కైవాక్‌లు..!!

హైదరాబాద్ వాసులకు తీపి కబురు. ట్రాఫిక్ కష్టాల వేళ కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. హెచ్​ఎండీఏ ఆధ్వర్యంలోని ఉమ్టా వివిధ రద్దీ ప్రాంతాల్లో స్కైవాక్‌లు, పాదచారుల వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించింది. తొలి విడతలో ఎక్కడ అవసరమో ప్రతిపాదనలు సిద్దం చేసింది. ముందుగా నిత్యం రద్దీగా ఉండే రెండు ప్రాంతాలను ఎంపిక చేసింది. ఇక్కడ డీపీఆర్ సిద్దం అవుతోంది. దీంతో..త్వరలోనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

ట్రాఫిక్ రద్దీతో సతమతం అవుతున్న వేళ హైదరాబాద్ వాసుల కోసం ఉమ్టా కీలక ప్రతి పాదనలు సిద్దం చేసింది. నగరంలో రద్దీగా ఉండే దిల్ షుక్ నగర్, ఎల్పీ నగర్ తో పాటుగా ఐటీ కారిడార్ లోని ఐకియా సమీపంలో అదనంగా స్కై వాక్ లు అవసరమని గుర్తించింది. ఇక్కడ కొత్త వాటి నిర్మాణం కోసం ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య కారణంగా పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడటం తో పాటుగా ప్రమాదాలు, గాయాలు, ప్రాణనష్టం కూడా సంభవిస్తున్నాయని పేర్కొంది. ఐటీ కారిడార్‌కు అనుగుణంగా రూపొందించిన ఈ స్కైవాక్‌లలో ఆధునిక ఎస్కలేటర్లు, లిఫ్టులు, కవర్డ్ వాక్‌వేలు ఉండనున్నాయి. దీంతో ప్రజలు వర్షం లేదా తీవ్రమైన ఎండకు గురి కాకుండా తమ ఆఫీసులకు సులభంగా చేరుకొనే అవకాశం కలుగుతుంది.

హైదరాబాద్​లో 3 రోజుల పాటు ట్రాఫిక్​ ఆంక్షలు - మళ్లింపులు ఇలా..!!
హైదరాబాద్​లో 3 రోజుల పాటు ట్రాఫిక్​ ఆంక్షలు - మళ్లింపులు ఇలా..!!
humta-latest-proposals-for-two-sky-walks-in-hyderabad-city-as-latest-survey-here-the-reports

గ్రేటర్ పరిధిలో అధ్యయనం.. ప్రతిపాదనలు

ఐటి కారిడార్ లోని ఐకియా జంక్షన్ లో నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. దీంతో.. మెట్రో స్టేషన్, మైండ్ ​స్పేస్​ ఐటీ పార్కు, ఐకియాను కలుపుతూ కొత్తగా స్కైవాక్​ నిర్మించే విధంగా ప్రతిపాదన చేసారు. దీని ద్వారా రాయదుర్గం మెట్రోస్టేషన్​లో దిగే వేలాది మంది ఉద్యోగులు ఎటు వైపు అయినా సులభంగా వెళ్లడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నివేదికలో పేర్కొన్నారు. అదే విధంగా దిల్ షుక్ నగర్ .. ఎల్బీ నగర్ జోన్ లో నిత్యం విద్యార్ధులు.. వ్యాపారాలతో రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ ట్రాఫిక్ పెరిగింది. ప్రజల ఇబ్బందులను గుర్తించి... అక్కడ మెట్రో స్టేషన్, బస్​ బే, స్థానిక కాలనీలను కలిపే స్కైవాక్ నిర్మించేలా మరో ప్రతిపాదన సిద్దం చేసారు. ఎల్బీ నగర్ ను కలుపుతూ ఈ నిర్మాణం చేయటం పైన ఆలోచన చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+