అప్పుడే ఓటీటీలోకి వంద కోట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ.. అస్సలు మిస్ కావొద్దు..!

టాలీవుడ్ లో హిట్టు కోసం పరితపించిన హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు. 2015 లో అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఇప్పటి వరకూ సరైన బ్లాక్ బస్టర్ విజయాన్ని ఆయన అందించలేకపోయారు. కానీ ఇటీవల 'లెనిన్' సినిమాతో ఆ కల నెరవేరింది. ఈసారి కసిగా ఎలాగైనా హిట్ కొట్టాలన్న తాపత్రయంతో తీసిన సినిమా లెనిన్.. అక్కినేని అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా తొలి 100 కోట్ల సినిమాగా చరిత్ర సృష్టించింది. అంతేకాక అఖిల్ నట విశ్వరూపం టాలీవుడ్ ప్రేక్షకుల ముందు ఉంచింది. ఒక రకంగా చెప్పాలంటే అఖిల్ సినిమాలు లెనిన్ కు ముందు లెనిన్ కు తర్వాత అనేంతలా ఈ సినిమా ఆయన కెరీర్ ను మలుపుతిప్పింది.

భల్లాలదేవుడికి ఏమైంది..? ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు అన్నా..!
భల్లాలదేవుడికి ఏమైంది..? ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు అన్నా..!

లెనిన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 10 న విడుదల అయింది. ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది. అలా ఇటీవల ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. దాంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికీ ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. కానీ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఆగస్టు 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ 5 లో లెనిన్ మూవీ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు.

భల్లాలదేవుడికి ఏమైంది..? ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు అన్నా..!
భల్లాలదేవుడికి ఏమైంది..? ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు అన్నా..!

లెనిన్ మూవీలో అక్కినేని అఖిల్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ పాత్రలో ఒదిగిపోయింది. ఈ చిత్రాన్ని మురళీ కిశోర్ అబ్బూరు డైరెక్ట్ చేశారు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి హీరో నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న లెనిన్‌ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి రానుండ‌టం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ ను 19 కోట్ల‌కు జీ5 ఓటీటీ కొనుగోలు చేసినట్లు సమాచారం.

Lenin movie starring Akhil Akkineni and Bhagyashri Borse is set to stream on ZEE5 starting August 7

ఇక లెనిన్ మూవీలో అఖిల్ నటన, భాగ్యశ్రీ బోర్సే తో లవ్ కెమిస్ట్రీ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. వీరితోపాటు ఈ సినిమాలో శివాజీ, ఈశ్వ‌రీరావు, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి త‌మ‌న్ మ్యూజిక్ బిగ్ ప్లస్ పాయింట్ అయింది. ఈ మూవీని థియేటర్లలో మిస్ అయినవాళ్లు తప్పకుండా ఓటీటీలో చూసేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+