ఇన్‌స్టాగ్రామ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ బికినీ ఫోటోల రచ్చ.. యూనివర్సిటీ అధికారులు ఏం చేశారంటే!!
ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఆకర్షణీయమైన జీతంతో, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకురాలి ఫోటోలు ఆమె ఉద్యోగానికే ఎసరు పెట్టింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ బికినీలో ఉన్న ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో లో షేర్ చేయడమే ఆమెకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. బికినీ ఫోటో ఎఫెక్టుతో యూనివర్సిటీ యాజమాన్యం సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ను, బలవంతంగా రాజీనామా చేయించి, యూనివర్సిటీ పరువు పోగొట్టినందుకు 99 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. గత సంవత్సరం అక్టోబర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బికినీ ఫోటోలు.. ఉద్యోగానికి బలవంతంగా రాజీనామా
కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్శిటీలోని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బికినీలో ఉన్న ఫోటోలను , ఓ విద్యార్థి చూడడాన్ని గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు యూనివర్సిటీ అధికారులకు సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పై ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం మొదటి సంవత్సరం చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి తండ్రి నుండి వ్రాతపూర్వక ఫిర్యాదు అందుకున్న తర్వాత విశ్వవిద్యాలయం నుండి సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ను బలవంతంగా రాజీనామా చేయించారు.

తల్లిదండ్రుల నుండి తీవ్ర అభ్యంతరం.. కంప్లైంట్ చేసిన అధికారులు
అధ్యాపకురాలు లోదుస్తులు ధరించి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడం సిగ్గుచేటని సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థి తండ్రి బీకే ముఖర్జీగా గుర్తించిన ఫిర్యాదు లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లిదండ్రులు లేవనెత్తిన అభ్యంతరం తరువాత, విశ్వవిద్యాలయ అధికారులు సంఘటన గురించి సమాచారం అందించి ప్రొఫెసర్‌ను పిలిచి మాట్లాడారు. సంబంధిత అధికారులు ఆమె ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా చిత్రాలతో పాటు ఫిర్యాదు లేఖను కూడా ఆమెకు చూపించారు.
యూనివర్సిటీ ఆరోపణలను ఖండించిన అసిస్టెంట్ ప్రొఫెసర్
ఆ తర్వాత యూనివర్శిటీ ప్రతిష్టకు భంగం కలిగించినందుకే ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా రాజీనామా చేశారు. సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ తనపై చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ వాదిస్తున్నారు. తనను ఉద్యోగం నుంచి తొలగించాలని యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం లైంగిక వేధింపులు, ఉద్దేశ్యపూర్వక హత్యేనని ఆమె అన్నారు.

యూనివర్సిటీ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తా అంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రొఫెసర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని, తర్వాత అక్టోబర్ 2021లో తిరిగి పోలీసు ఫిర్యాదును దాఖలు చేసినట్లు పేర్కొంది. ఇది ఆమె ఫోటోలు సోషల్ మీడియా హ్యాండిల్ లో రావడానికి కారణమయ్యాయని ఆమె చెబుతోంది. చెయ్యని పాపానికి శిక్ష అనుభవించేలా చేస్తున్న యూనివర్సిటీ యాజమాన్యంపై తాను న్యాయ పోరాటం చేస్తానని అసిస్టెంట్ ప్రొఫెసర్ వెల్లడించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications