శశికళ, జాతకాలు సరిగా చూడకపోతే ఇంతే: సీఎం కాదు కదా ? బీజేపీ ఎంపీ

జాతకాలు సరిగా చూసి ముహూర్తాలు పెట్టకపోతే ఆ ఫలితాలు ఇలాగే ఉంటాయని, శశికళ ఈనెల తొమ్మిదోతేదీన తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం అలాంటిదే అని బీజేపీ నాయకుడు,

చెన్నై: జాతకాలు సరిగా చూసి ముహూర్తాలు పెట్టకపోతే ఆ ఫలితాలు ఇలాగే ఉంటాయని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి వీకే. శశికల నటరాజన్ ను ఉద్దేశించి బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఎద్దేవ చేశారు.

జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టుకోవడంలో తమిళనాడు ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. శశికళ ఈనెల తొమ్మిదోతేదీన తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం అలాంటిదే అని సుబ్రమణ్యస్వామి మంగళవారం వ్యంగంగా ట్వీట్ చేశారు.

Astrology which not perfectly understood and hence can go wrong predicts Sasikala wiil become CM on 9 th Feb,

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలోనే శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడటంతో సుబ్రమణ్యస్వామి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళ సీఎం అవ్వడానికి అవకాశం ఇవ్వారాదని తమిళనాడు ప్రజలు గట్టిగా చెబుతున్నారు.

తమిళనాడులోని నక్కిరన్ అనే పత్రిక ఆన్ లైన్ లో శశికళ ముఖ్యమంత్రి కావడంపై అభిప్రాయాలు సేకరించింది. ఒక్క గంటలో ఆమెకు అనుకూలంగా 7,400 మంది ఓటు వేశారు. అయితే శశికళకు వ్యతిరేకంగా అదే సమయంలో 7.12 లక్షల మంది ఓటు వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును శశికళ గౌరవించాలని 90 శాతం మంది చెప్పడంతో శశికళ వర్గీయులు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+