మహారాష్ట్రలో బస్సు లోయలో పడి 27 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడిపోవడంతో 27 మంది మృతి చెందారు. ఈ సంఘటన గురువారం ఉదయం ముంబై - నాసిక్ హైవే పైన చోటు చేసుకుంది. సమాచారం మేరకు... కల్యాణ్ నుండి అహ్మద్ నగర్‌కు వెళ్తున్న బస్సు మల్సెజ్ ఘాట్ ప్రాంతంలోని తొకవాడే వద్ద ప్రమాదానికి గురైంది.
ఇందులో నలబై మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు. ఓ మూలవద్ద బస్సు పైకి ఓ టెంపో దూసుకు రావడంతో డ్రైవర్ దానిని తప్పించబోయాడు. దీంతో బస్సు అదుపు తప్పి 250 మీటర్ల లోతు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా, అందులో 19 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు.

ప్రమాద స్థలంలో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగించేలా ఈ ప్రాంతం ఉంది.
బస్సు అహ్మద్ నగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని జిల్లా డిసాస్టర్ కంట్రోల్ ఆఫీసర్ జైదీప్ విశ్వే చెప్పారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు.
బస్సు లోయలో పడినట్లు జిల్లా కేంద్రానికి ఉదయం పదిన్నర గంటల సమయంలో సమాచారం వచ్చింది. సమాచారం అందగానే పోలీసులు, సహాయక సిబ్బంది, వైద్య సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications