Yogi Adityanath: రాత్రికి రాత్రి కీలక ఆదేశాలు జారీ
లక్నో: గ్యాంగ్‌స్టర్, లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్‌ను దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ కూడా మరణించారు. ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి వారిద్దరిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్ అక్కడికక్కడే మరణించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇటీవలే అతిక్ అహ్మద్ కుమారుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియలు ముగిసిన వేళ- అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్‌పై కాల్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనతో ప్రయాగ్ రాజ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిద్దరినీ మెడికల్ చెకప్ కోసం ఆసుపత్రికి తరలిస్తోన్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ ఘటన తరువాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్ కే విశ్వకర్మ, అదనపు డీజీపీలు, లక్నో నగర పోలీస్ కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ హత్యానంతరం రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, 24 గంటల పాటు పర్యవేక్షణ ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని చెప్పారు.
వదంతులను నమ్మవద్దని యోగి ఆదిత్యనాథ్.. రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా వదంతులను వ్యాపింపజేసే వారిపై నిఘా ఉంచినట్లు చెప్పారు. అతిక్ అహ్మద్ సోదరుల హత్య తరువాత రాష్ట్రంలో మత కల్లోలాలను రేకెత్తించడానికి అసాంఘిక శక్తులు ప్రయత్నించే ప్రమాదం ఉందని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వదంతులను వ్యాపింపజేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ పోలీసు యంత్రాంగానికి ఆదేశించారు. అతిక్ సోదరుల హత్యానంతరం ప్రయాగ్‌రాజ‌్‌లో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. లక్నోలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లోనూ పోలీసులు రాత్రంతా పహారా కాశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సన్నద్ధం అయ్యారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications