వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఎటిఎంలో డబ్బుల వరద, మూడువేలకు 70 వేలు డ్రా, బారులు తీరిన జనం

ఆ ఎటిఎంలో మూడువేలు డబ్బులు డ్రా చేస్తే 70 వేల రూపాయాలు డ్రా అవుతున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

రాజస్థాన్ :పెద్ద నగదు నోట్ల రద్దుతో కరెన్సీ కోసం ప్రజలు ఎదరుచూస్తున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.అయితే రాజస్థాన్ లోని ఓ ఎటిఎంలో మూడువేల ఐదువందలు డ్రా చేస్తే డెబ్బై వేల రూపాయాలు వస్తున్నాయి.దీంతో జనం భారీ ఎత్తున ఈ ఎటిఎం సెంటర్ కు చేరుకొని డబ్బులు డ్రా చేసుకొంటున్నారు.

రాజస్థాన్ లోని జైపూర్ కు సమీపంలోని టాంక్ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎటిఎం నుండి డబ్బులు డ్రా చేస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి.జితేష్ దివాకర్ అనే వ్యక్తి ఎటిఎం కు వెళ్ళి మూడువేల ఐదురూపాయాలు డ్రా చేయాలని టైప్ చేశాడు. అయితే ఆయనకు 70వేల రూపాయాలు వచ్చాయి. ఆయనకు ఒక్కరే కాదు అందరికీ ఇదే తరహలో పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయి.

ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు ఈ ఎటిఎం వద్ద బారులు తీరారు. ఈ విషయాన్ని స్థానికులు బ్యాంకు సిబ్బందికి చేరవేశారు. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది ఎటిఎంను మూసివేశారు. కాని, అప్పటికే 6.76 లక్షలను విత్ డ్రా చేశారు.

 atm over flows cash in rajastHan

వంద నోట్ల స్థానంలో రెండువేల రూపాయాలను లోడ్ చేయడం వల్ల ఈ లోపం తలెత్తిందని బ్యాంక్ ప్రతినిధి హరిశంకర్ మీనా తెలిపారు. కానీ, సాధారణంగా ఇలా జరగదన్నారు. వంద రూపాయాల కేసెట్ లో రెండువేల రూపాయాల నోట్లు లోడ్ చేయడం సాధ్యం కాదన్నారు. ఈ తప్పిదంపై సాంకేతిక నిపుణులతో సంప్రదించనున్నట్టు ఆయన ప్రకటించారు.

ఎటిఎం మెషీన్ రికార్డుల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు పోలీసుల సహకారంతో ఖాతాదారుల నుండి నగదును తీసుకోనున్నట్టు ఆయన ప్రకటించారు.దివాకర్ అనే ఖాతాదారుడే తమకు సమాచారం ఇచ్చారని మిగిలినవారు అక్కడి నుండి వెళ్ళిపోయారని చెప్పారు.

English summary
atm over flows cash in rajastan, technichal mistake in atm, customers get huge amount from a atm in rajastan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X