ఆగస్టులో 12.6 శాతం క్షీణించిన ఎగుమతులు , వాణిజ్య లోటు 6.77 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలతోపాటు భారత్ కూడా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఎగుమతులు కూడా ఎక్కువగా జరగడం లేదు. జులై ఎగుమతులలో 10.2 శాతం క్షీణత చూపగా.. ఆగస్టులో అది 12.6 శాతానికి చేరుకుంది. అయితే, పెట్రోలియం, జెమ్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ లాంటి ఎగుమతులు బాగానే పుంజుకున్నాయి.
ఆరునెలల సంకోచాన్ని పూర్తి చేస్తూ అవుట్‌బౌండ్ వాణిజ్యం. 22.7 బిలియన్ల వద్ద స్థిరపడింది. కరోనా ప్రభావం తీవ్రం కావడంతో ఏప్రిల్ నుంచి ఎగుమతులు భారీగా పడిపోయాయి. ఏప్రిల్ నెలలో 60.28శాతం ఎగుమతులు క్షీణించగా.. దశలవారీ అన్‌లాక్‌తో ఆగస్టులో అది సింగిల్ డిజిట్‌కు వస్తుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ, అలా జరగలేదు. సెప్టెంబర్ నెలలోనైనా ఎగుమతులు మరింత పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది.

ఇప్పుడు, వాణిజ్య విభాగం మంగళవారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల్లో సంచిత ఎగుమతులు అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26.65 శాతం తగ్గాయి.
ఆగస్టులో దిగమతులు 29.47 బిలియన్ డాలర్లతో 26.04 శాతానికి పడిపోగా.. ఇది జులైలో 28.4 శాతంగా ఉంది. గత ఐదు నెలలుగా దిగుమతుల్లోనూ క్షీనత నమోదవుతూనే ఉంది. జూన్ నెలలో 800 మిలియన్ డాలర్ల అరుదైన వాణిజ్య మిగులును చూసిన తరువాత, వాణిజ్య లోటు 4 నెలల గరిష్ట స్థాయి 6.77 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఏదేమైనా, బంగారు దిగుమతుల్లో 171 శాతం పెరుగుదల నమోదు కావడం గమనార్హం. దీంతో రాబోయే పండగలు, వివాహ కార్యక్రమాల నేపథ్యంలో మరింత బంగారం దిగుమతి చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ధరలు కూడా పెరుగుతుండటంతో వ్యాపారులు దిగుమతులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications