Aunty: అత్త ఆనందం కోసం ? మామ గొంతు కోసి చంపేసిన అల్లుడు, మ్యాటర్ తెలుసుకుని షాక్ !
లక్నో/ప్రతాప్ గడ్: వివాహం చేసుకున్న మహిళ పుట్టింటి సమీపంలోనే ఉన్న ఊరిలోనే భర్తతో నివాసం ఉంటున్నది. భార్య కుటుంబ సభ్యులు దంపతుల ఇంటికి ఎక్కువగా వెళ్లి వస్తున్నారు. భార్యకు వరుసకు అల్లుడు అయ్యే యువకుడు ఆమె ఇంటికి వెళ్లి వస్తున్నాడు. అయితే భార్య బంధువులు తన ఇంటికి రాకూడదని భర్త అతని భార్యతో గొడవ చేస్తున్నాడు. కొంతకాలంగా దంపతుల మద్య ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం భర్త కాలువ పక్కన శవమై కనిపించాడు. భర్త గొంతు కోసి చంపేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు భార్య అల్లుడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో అల్లుడు చెప్పిన వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

పక్క ఊర్లో అత్త కాపురం
ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ లోని అన్పూర్ దేవ్ సరాలో జితేంద్ర కుమార్ అలియాస్ సునీల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. జితేంద్ర కుమార్ నివాసం ఉంటున్న పక్క ఊరిలో నివాసం ఉంటున్న రేఖా అనే మహిళను కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన మొదట్లో జితేంద్ర కుమార్, రేఖా దంపతులు చాలా సంతోషంగా జీవనం సాగించారు.

అత్త ఇంటికి వెలుతున్న అల్లుడు
జితేంద్ర కుమార్ భార్య రేఖా కుటుంబ సభ్యులు, బంధువులు వాళ్ల ఇంటికి ఎక్కువగా వెళ్లి వస్తున్నారు. భార్య రేఖాకు వరుసకు అల్లుడు అయ్యే సూరజ్ కుమార్ అనే యువకుడు కూడా వాళ్ల ఇంటికి ఎక్కువగా వెళ్లి వస్తున్నాడు. అయితే మీ బంధువులు తన ఇంటికి రాకూడదని భర్త జితేంద్ర కుమార్ అతని భార్యతో గొడవలు చేస్తున్నాడు.

రోడ్డు పక్కన శవమైన మామ
డిసెంబర్ 24వ తేదీన జితేంద్ర కుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి జితేంద్ర కుమార్ ఇంటికి తిరిగిరాలేదు. జితేంద్ర కుమార్ ఇంటికి రాకపోయినా అతని భార్య రేఖా పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. రెండు రోజుల తరువాత జితేంద్ర కుమార్ ఊరి సమీపంలోని కాలువ పక్కన శవమై కనిపించాడు.

మామ హత్య కేసులో అల్లుడు అరెస్టు
జితేంద్ర కుమార్ గొంతు కోసి చంపేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన అన్పూర్ దేవ్ సరా పోలీసులు హత్యకు గురైన జితేంద్ర కుమార్ భార్య రేఖా అల్లుడు సూరజ్ కుమార్ ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో సూరజ్ కుమార్ చెప్పిన వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

మామను అందుకే చంపేశాను
మా అత్త రేఖాను ఆమె తండ్రితో మాట్లాడకూడదని జితేంద్ర కుమార్ వేధింపులకు గురి చేశాడని. మా అత్త రేఖాతో పాటు మా కుటుంబ సభ్యులు ఎక్కువ టార్చర్ పెట్టడం వలనే జితేంద్ర కుమార్ ను నేను గొంతు కోసి చంపేశానని సూరజ్ కుమార్ నేరం అంగీకరించాడని పోలీసులు అన్నారు. మామను అల్లుడు హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications