Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Aunty: బాత్ రూమ్ లో అత్త గొంతు కోసి చంపి బెడ్ రూమ్ లో అల్లుడి ఆత్మహత్య, భర్త లేని టైమ్ లో !

లక్నో/చెన్నై: ప్రభుత్వ అధికారి, ఆయన భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వ అధికారి భార్య మేనల్లుడు ఆమె ఇంటికి వెళ్లాడు. అత్త ఇంట్లో ఉంటున్న అల్లుడు కాలం గడిపేస్తున్నాడు. అత్తతో ఎంతో చనువుగా ఉంటున్న అల్లుడు ఆమె కొడుకులతో పాటు హ్యాపీగా ఉండేవాడు. భర్త వేరే జిల్లాలో ఉద్యోగం చేస్తుండటంతో ఆయన భార్య, ఆమె కొడుకులు, అల్లుడు ఇంట్లో ఉన్నారు. తరువాత ఏమి జరిగిందో ఏమో కాని అల్లుడు చేసిన పనికి అందరూ హడలిపోయారు. బాత్ రూమ్ లో అత్త గొంతు కోసి చంపేసిన అల్లుడు మేడ మీద ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ప్రభుత్వ అధికారి

ప్రభుత్వ అధికారి

ఉత్తరప్రదేశ్ లోని ప్రయోగ్ రాజ్ జిల్లాలో ఘన్ శ్యామ్ పీసీఎస్ అధికారిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఘన్ శ్యామ్ ప్రయోగ్ రాజ్ జిల్లా అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఘన్ శ్యామ్, ఆయన భార్య అనిత, వీరి కుమారులు విశేష్, అలంకార్ కలిసి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలోని రాజాజీపురం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

 అత్త ఇంట్లో మకాం వేసిన మేనల్లుడు

అత్త ఇంట్లో మకాం వేసిన మేనల్లుడు

అనితకు అజిత్ (38) అనే మేనల్లుడు ఉన్నాడు. చాలా కాలం నుంచి అజిత్ అతని మేనత్త అనిత ఇంట్లోనే ఉంటున్నాడు. భార్య అనిత మేనల్లుడు అజిత్ ఇంట్లో ఉంటూ తన భార్యకు తోడుగా ఉంటాడని, నేను బయట ఊర్లో ఉంటే తన భార్య సేఫ్ గా ఉంటుందని, తన కుమారులు, అల్లుడు కలిసి సంతోషంగా ఉంటే ఇంకా మంచిదని ఘన్ శ్యామ్ కూడా అజిత్ విషయంలో ఏమీ అభ్యంతరం చెప్పలేదు.

అంత హ్యాపీగానే ఉండేది

అంత హ్యాపీగానే ఉండేది


అత్త అనిత ఇంట్లో ఉంటున్న అల్లుడు అజిత్ హ్యీపీగా కాలం గడిపేస్తున్నాడు. అత్త అనితతో ఎంతో చనువుగా ఉంటున్న అల్లుడు అజిత్ ఆమె కొడుకులతో పాటు హ్యాపీగా ఉండేవాడు. భర్త ఘన్ శ్యామ్ ఉద్యోగరీత్యా ప్రయోగ్ రాజ్ జిల్లాలో ఉండటంతో ఆయన భార్య అనిత, ఆమె కొడుకులు, అల్లుడు అజిత్ ఇంట్లోనే ఉంటూ హ్యీపీగా కాలం గడిపేస్తున్నారు.

అత్తను బాత్ రూమ్ గొంతు కేసి చంపేసిన అల్లుడు

అత్తను బాత్ రూమ్ గొంతు కేసి చంపేసిన అల్లుడు

ఘన్ శ్యామ్ ఉద్యోగం పని మీద వేరే ఊర్లో ఉన్నారు. ఇంట్లో అనిత ఆమె కొడుకులు, అల్లుడు అజిత్ ఉన్నారు. ఇద్దరు కొడుకులు పగలు ఒక బెడ్ రూమ్ లో ఆన్ లైన్ క్లాసులతో బిజీగా ఉంటున్నారు. రాత్రి ఎవరి గదుల్లో వారు నిద్రపోతున్నారు. రాత్రి అత్త అనిత, అల్లుడు అజిత్ ఏదో విషయంలో గొడవపడిన విషయం ఆమె కొడుకులకు వినపడింది. తరువాత బాత్ రూమ్ లోకి అనిత వెళ్లింది. తరువాత అల్లుడు అజిత్ కూడా బాత్ రూమ్ దగ్గరకు వెళ్లాడు. తరువాత అల్లుడు అజిత్ బాత్ రూమ్ లో ఉన్న అత్త అనితను ఆమె గొంతు కోసి దారుణంగా చంపేశాడు.

బెడ్ రూమ్ లో అల్లుడు ఆత్మహత్య

బెడ్ రూమ్ లో అల్లుడు ఆత్మహత్య

బాత్ రూమ్ లో అత్త అనితను హత్య చేసిన అజిత్ నేరుగా మేడ మీద ఉన్న అతని బెడ్ రూమ్ లోకి వెళ్లి బెడ్ షీట్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంట తరువాత అనిత కొడుకు అలంకార్ బాత్ రూమ్ దగ్గరకు వెళ్లాడు. తల్లి అనిత బాత్ రూమ్ లో శవమై కనిపించడంతో షాక్ అయిన అలంకార్ అతని తండ్రి ఘన్ శ్యామ్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు.

ఏం జరిగిందో తెలీదు

ఏం జరిగిందో తెలీదు

డిగ్రీ పూర్తి చేసిన అజిత్ తరువాత మా ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడని అనిత భర్త ఘన్ శ్యామ్ చెప్పాడని లక్నో వెస్ట్ జోన్ ఎస్పీ రాజేష్ శ్రీవాస్తవా అంటున్నారు. అత్త అనితను అజిత్ ఎందుకు హత్య చేశాడో తెలీదని, అతను ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసిపెట్టలేదని వెస్ట్ జోన్ ఎస్పీ రాజేష్ శ్రీవాస్తవా మీడియాకు చెప్పారు. బాత్ రూమ్ లో అత్తను హత్య చేసి అల్లుడు ఆత్మహత్య చేసుకోవడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+