lockdown:ఫ్రీ పాల కోసం కత్తి పోట్లు, ఐటీ హబ్‌లో డిష్యూం డిష్యూం.. ఆస్పత్రిలో చేరిన ఆటోడ్రైవర్..
కరోనా వైరస్ పుణ్యాన కత్తిపోట్ల ఘటనలు జరుగుతున్నాయి. ఐటీ హబ్ బెంగళూరులో ఇటీవల పాల కోసం కత్తిపోటు జరగగా.. మంగళవారం మరోసారి జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వినోద్ కుమార్ అనే ఆటో డ్రైవర్ గాయపడ్డారు. అతనిని ఆస్పత్రికి తరలించారు.
బెంగళూరు వీవీ గిరి కాలనీలో బీబీఎంపీ ఇంచార్జీ నాగరాజు పాలు అందజేస్తున్నారు. అయితే తనకు తెలిసిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో గొడవ జరిగింది. పాల విషయమై సోమవారం నాగరాజ్, ఆటో డ్రైవర్ వినోద్ కుమార్ మధ్య గొడవ జరిగింది. ఆ మరునాడు వినోద్ కోడలు లలిత.. నాగరాజును నిలదీయడంతో గొడవ పీక్‌కి చేరింది. ఇరువర్గాలు కత్తులు దూసుకున్నాయి.

నాగరాజ్, వినోద్ వర్గాలు కొట్లాటకు దిగాయి. ఇంతలో నాగరాజ్ వర్గానికి చెందిన కొందరు వినోద్‌పై కత్తితో దాడి చేశారు. అతనిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. కత్తితో దాడిచేసిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.