జార్ఖండ్‌లో ఇండియా కూటమికి అత్యధిక సీట్లిచ్చిన ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్: బీజేపీకి షాకేనా?
జార్ఖండ్ రాష్ట్రంలో రెండో దశ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దీంతో పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తేలుస్తున్నాయి. తాజాగా, యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ తన అంచనాలను విడుదల చేసింది.
యాక్సెస్ మై ఇండియా ఇతర ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా జేఎంఎం-కాంగ్రెస్ కాంగ్రెస్ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని పేర్కొంది. యాక్సెస్ మై ఇండియా అంచనాల ప్రకారం.. ఎన్డీఏకు 25 సీట్లు వస్తాయని, ఇండియా కూటమి 53 స్థానాలు విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇక, ఇతరులకు 3 సీట్లు దక్కే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇతర ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలు ఇలా...
చాణక్య స్ట్రాటజీస్ సర్వే అంచనాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం చేపడుతుంది. ఎన్డీఏ కూటమికి మొత్తం 81 సీట్లకు గానూ 45-50 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి 35-38 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇతరులకు 3-5 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది.
మరోవైపు, మరికొన్ని సర్వే సంస్థలు కూడా జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్డీఏదే అధికారమని పేర్కొంటున్నాయి. మాట్రిట్జ్ సర్వే ప్రకారం.. ఎన్డీఏ కూటమికి 42-47 స్థానాలు, కాంగ్రెస్-జేఎంఎం కూటమి 25-30, ఇతరులు 1-4 సీట్లు సాధిస్తారని అంచనా వేసింది. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఎన్డీఏ కూటమికి 40-44, జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి 30-40, ఇతరులకు 0-1 సీట్లు వస్తాయని పేర్కొంది.
పీపుల్స్ పల్స్ అంచనాల ప్రకారం.. ఇండియా కూటమికి 44-53, ఇండియా కూటమికి 25-37, ఇతరులకు 5-9 స్థానాలు దక్కే అవకాశం ఉందని తేల్చింది. పీమార్క్ సర్వే ప్రకారం.. ఎన్డీఏకు 31-40 సీట్లు, ఇండియా కూటమికి 37-47, ఇతరులకు 1-6 సీట్లు వస్తాయని పేర్కొంది. పీమార్క్ తోపాటు యాక్సెస్ మైఇండియా, పోల్స్ ఆఫ్ పోల్స్ ఇండి కూటమికి ఎక్కువ సీట్లను కట్టబెట్టాయి.
యాక్సెస్ మైఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఎన్డీఏకు 25 సీట్లు, ఇండియా కూటమికి 53 సీట్లు, ఇతరులకు 3 స్థానాలు దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది. పోల్స్ ఆఫ్ పల్స్ అంచనాల ప్రకారం.. ఎన్డీఏకు 38-43 సీట్లు, ఇండియా కూటమికి 34-41 స్థానాలు, ఇతరులకు 2-5 సీట్లు వస్తాయని వెల్లడించింది. మొత్తానికి ఈ ఎగ్జిట్స్ పోల్స్ అధికారంలో ఉన్న జేఎంఎం పార్టీకి కొంత నిరాశనే కలిగించాలే ఉన్నాయి. అయితే, నవంబర్ 23 వచ్చే అసలైన ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications