అయోధ్య ఎయిర్ పోర్టు ఇక ‘‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’’

అయోధ్యను అంతర్జాతీయ పుణ్యక్షేత్రంగా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే విధంగా ఒక స్వర్గధామంగా తయారు చేసే పనిలో బిజీగా ఉంది భారతదేశం. ఈనెల 22వ తేదీన అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవానికి, విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ప్రధాన నరేంద్ర మోడీతో పాటు దేశంలోని, విదేశాలలోని ప్రముఖులకు ఆహ్వానాలు పంపి వారిని ఆహ్వానిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రంగా అయోధ్యను తీర్చిదిద్దే క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

అయోధ్య విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడంతోపాటు ఎయిర్ పోర్టుకు ''మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్'' అని పేరు పెట్టే ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి నిన్న ఆమోదం తెలిపింది. అయోధ్యను ప్రపంచస్థాయి తీర్థక్షేత్రంగా తీర్చిదిద్దడంతోపాటు విదేశీ యాత్రికులను, పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Ayodhya Airport will now serve as Maharshi Valmiki International Airport

ఈ నిర్ణయం ద్వారా రాబోయే రోజుల్లో అయోధ్య కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తమవుతాయని, అయోధ్య సాంస్కృతిక వారసత్వం విశ్వ వ్యాప్తమవుతుందని భావిస్తున్నారు. అయోధ్య యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని మరియు ప్రపంచ పుణ్యక్షేత్రంగా దాని ప్రాముఖ్యతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీయాత్రికులు మరియు పర్యాటకులకు తలుపులు తెరుస్తూ 1450 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో విమానాశ్రయం మొదటి దశను అభివృద్ధి చేశారు.

విమానాశ్రయం యొక్క టెర్మినల్ భవనం 6,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఏటా పది లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. టెర్మినల్ భవనం యొక్క ముఖ భాగం అయోధ్య రామ మందిర ఆలయం యొక్క నిర్మాణాన్ని వర్ణిస్తుంది. ఇక ఈ విమానాశ్రయం రెండవ దశలో 50వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నారు. 600మంది పీక్ అవర్ ప్రయాణికులకు వసతి కల్పించేలా విమానాశ్రయం రూపొందించబడింది.

Ayodhya Airport will now serve as Maharshi Valmiki International Airport

యూపీ సర్కార్ విమానాశ్రయ నిర్మాణం కోసం 821ఎకరాల భూమిని కేటాయించింది. అయోధ్య రామ మందిరాన్ని అత్యద్భుతంగా ప్రపంచం మొత్తం దృష్టి సారించేలా నిర్మాణం చేస్తున్న క్రమంలో ఇక్కడి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చి దిద్దింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+