Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ayodhya ram mandir inauguration Live: అయోధ్యలో ఆశీనులైన రాములోరు..!

మరికొన్ని గంటల్లో దేశంలో ఓ మహాఘట్టానికి తెరలేవనుంది. అయోధ్య మహానగరం నడిబొడ్డున శ్రీరామచంద్రుల వారు కొలువుతీరనున్నారు.అయోధ్య రామమందిర ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఇక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల మధ్య జరుగుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ప్రాణప్రతిష్టకు ముందు చేసే ప్రత్యేక పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది.

ప్రాణ్ అంటే జీవితం ప్రతిష్ట అనగా ఏర్పాటు.ఇదొక పవిత్రమైన ఘట్టం.శ్రీరాముని విగ్రహానికి జీవం పోసే కార్యక్రమంగా చెప్పవచ్చు.దీంతో అక్కడ ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది.ఇందుకోసం చేసే ప్రత్యేక పూజలు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానంగా నిలుస్తాయి. ఇక అయోధ్యపురిలో శ్రీసీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంకు సంబంధించి పూర్తి వివరాలు లైవ్‌లో మీకోసం.

Ayodhya Ram mandir inauguration Live Updates In Telugu

Jan 23, 2024, 7:42 am IST
ఉత్తర్ ప్రదేశ్

అయోధ్య రామమందిరం వద్ద బారులు తీరిన భక్తజనం. వారిని నియంత్రించడానికి ప్రత్యేక బలగాలను నియమించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
Jan 23, 2024, 6:37 am IST
ఉత్తర్ ప్రదేశ్

భక్తులతో క్రిక్కిరిసిన అయోధ్య రామమందిరం. రామయ్యను దర్శించుకోవడానికి బారులు తీరిన జనం.
Jan 22, 2024, 8:43 pm IST

రామ మందిర ప్రారంభోత్సవంతో గుజరాత్ రాష్ట్రంలో మిన్నంటిన సంబరాలు.
Jan 22, 2024, 8:42 pm IST

బెంగళూరు ఇస్కాన్ ఆలయంలో దీపోత్సవం.
Jan 22, 2024, 8:41 pm IST

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా పాట్నాలో వేడుకలు.
Jan 22, 2024, 8:40 pm IST

కేరళలోని పద్మనాభస్వామి ఆలయం వద్ద దీపాలంకరణ
Jan 22, 2024, 8:39 pm IST

హనుమాన్ గర్హి ఆలయ అర్చకులు మహంత్ రాజు దాస్ మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ గొప్పగా జరిగిందన్నారు. దీపావళి వేడుక మరోసారి వచ్చిందన్నారు.
Jan 22, 2024, 7:29 pm IST

అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం సోమవారం రాత్రి దీపాలు వెలిగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా రామజ్యోతి అని పేర్కొన్నారు.
Jan 22, 2024, 7:08 pm IST

రామ్ లల్లా 'ప్రాణ్ ప్రతిష్ఠ' తర్వాత అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని వర్ణించే లేజర్, లైట్ షో.
Jan 22, 2024, 7:07 pm IST

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని దీపాలు వెలిగించారు.
Jan 22, 2024, 7:06 pm IST

ఉత్తరాఖండ్: అయోధ్యలోని రామ మందిరం 'ప్రాణ్ ప్రతిష్ఠ' కార్యక్రమం తర్వాత హరిద్వార్‌లోని హర్ కీ పౌరిలో హారతి నిర్వహిస్తున్నారు.
Jan 22, 2024, 7:04 pm IST

రామ మందిరం 'ప్రాణ్‌ప్రతిష్ఠ' తర్వాత అయోధ్యలోని సరయూ ఘాట్‌లో 'సంధ్యా ఆరతి' నిర్వహిస్తున్న దృశ్యం.
Jan 22, 2024, 6:38 pm IST

సోమవారం సాయంత్రం విద్యుద్దీపాలంకరణలో వెలిగిపోతున్న అయోధ్య రామమందిరం.
Jan 22, 2024, 2:32 pm IST
ఉత్తర్ ప్రదేశ్

రామమందిరం స్ఫూర్తి యావత్ దేశాన్ని ఉత్తేజితం చేస్తుంది. ప్రపంచదేశాలకు దిక్సూచి అవుతుంది: ప్రధాని మోదీ
Jan 22, 2024, 2:29 pm IST
ఉత్తర్ ప్రదేశ్

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం అనంతరం ప్రసంగిస్తోన్న ప్రధాని మోదీ. జనవరి 22వ తేదీన చారిత్రాత్మక రోజుగా అభివర్ణన.
Jan 22, 2024, 1:46 pm IST

ప్రధాని మోదీకి అయోధ్య రామమందిరం నమూనాను బహుకరించిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్
Jan 22, 2024, 1:45 pm IST

ఆర్ఎస్ఎస్‌ చీఫ్ మోహన్‌ భగవత్‌కు అయోధ్య రామమందిరం నమూనాను బహుకరించిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్
Jan 22, 2024, 1:44 pm IST
హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ హమీర్‌పూర్‌లోని అవ్హాదేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
Jan 22, 2024, 1:18 pm IST
ఉత్తర్ ప్రదేశ్

బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ముగిసిన అనంతరం మోదీ చేతికి రక్షాదారాన్ని కట్టిన అర్చకులు.
Jan 22, 2024, 1:16 pm IST
ఉత్తర్ ప్రదేశ్

అయోధ్య రామాలయంలో పూజాదికాలను నిర్వహించిన ప్రధాని మోదీ
Jan 22, 2024, 1:15 pm IST
ఉత్తర్ ప్రదేశ్

శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠపన అనంతరం భావోద్వేగానికి గురైన గాయకుడు సోనూ నిగమ్
Jan 22, 2024, 12:58 pm IST
ఉత్తర్ ప్రదేశ్

అయోధ్య రామమందిరం గర్భాలయానికి చెందిన ఫస్ట్ విజువల్స్.
Jan 22, 2024, 12:57 pm IST
ఉత్తర్ ప్రదేశ్

అయోధ్య ఆలయంలో రామ్ లల్లా విగ్రహానికి తొలి పూజలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.
Jan 22, 2024, 12:56 pm IST
ఉత్తర్ ప్రదేశ్

బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట అనంతరం సర్వదర్శనం కోసం తెరలను తొలగించిన అర్చకులు.
Jan 22, 2024, 12:48 pm IST
ఉత్తర్ ప్రదేశ్

రామ్ లల్లా గర్భగుడిలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్
Jan 22, 2024, 12:42 pm IST
ఉత్తర్ ప్రదేశ్

జన్మస్థలానికి ఏతెంచిన రఘురాముడు
Jan 22, 2024, 12:33 pm IST
ఉత్తర్ ప్రదేశ్

Ram Lalla
అంగరంగ వైభవంగా ముగిసిన రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం. విగ్రహం కళ్లకు కట్టిన కట్టును తొలగించి కాటుకను పూసిన ప్రధాని మోదీ
Jan 22, 2024, 12:28 pm IST
ఉత్తర్ ప్రదేశ్

ప్రధాని మోదీ చేతుల మీదుగా కొనసాగుతున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం. వేదమంత్రోచ్ఛారణలతో మారుమోగుతున్న అయోధ్యానగరి.
Jan 22, 2024, 12:22 pm IST
ఉత్తర్ ప్రదేశ్

అయోధ్య రామమందరంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య కొనసాగుతున్న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ.
Jan 22, 2024, 12:21 pm IST
ఉత్తర్ ప్రదేశ్

అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రక్రియలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+