రామసేతును నిర్మించిన ప్రదేశంలో.. భక్తి ప్రపత్తులతో

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకొక్క రోజే మిగిలివుంది. శతాబ్దాల నాటి కల సాకారం కానుంది. సోమవారం మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన పుణ్యస్థలంలో నిర్మితమైన రామమందిరం భక్తులకు అందుబాటులోకి రానుంది.

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్యనగరం సిద్ధమైంది. అయోధ్యాపురి మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలన్నింటినీ కూడా విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.

Ayodhya Ram Mandir: PM Modi offer prayers at Arichal Munai point near Dhanushkodi

రామమందిరం ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ.. సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలనూ పరిశుభ్రంగా ఉంచేలా స్వచ్ఛ అభియాన్‌ను శుక్రవారం ప్రారంభించారు. నాసిక్‌లోని ప్రాచీన కాలా రామ్ ఆలయం ప్రాంగణం మొత్తాన్నీ శుభ్రపరిచారు.

అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాచీన ఆలయాలను వరుసబెట్టి సందర్శిస్తోన్నారు మోదీ. ఏపీలోని శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో గల లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంతో మొదలైన ఆయన పర్యటన నేడూ కొనసాగుతోంది. కేరళ, తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను మోదీ సందర్శిస్తూ వస్తోన్నారు.

Ayodhya Ram Mandir: PM Modi offer prayers at Arichal Munai point near Dhanushkodi

ఇప్పటికే కేరళ గురువాయూర్‌లోని శ్రీకృష్ణుడి ఆలయం, తిరుచిరాపల్లిలోని రంగనాథస్వామి, రామేశ్వరంలోని రామనాథస్వామి దేవస్థానాలను సందర్శించారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా ఈ ఉదయం ధనుష్కోడిని సందర్శించారు మోదీ. ఈ ఉదయం ధనుష్కోడి వద్ద సముద్ర స్నానాన్ని ఆచరించారు. సూర్యభగవానుడికి ఆర్ఘ్యాన్ని అర్పించారు.

అనంతరం రామసేతు నిర్మాణం ప్రారంభమైన చోట ప్రత్యేక పూజలు చేశారు. ఆ ప్రదేశాన్ని పూలతో అలంకరించారు. భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఆ ప్రాంతాన్ని అరిచల్ మునైగా పిలుస్తారు. విభీషణుడిని శ్రీరామచంద్రుడు మొట్టమొదటిసారిగా కలుసుకుంది ఇక్కడేనని ప్రతీతి. అనంతరం శ్రీకోదండరామస్వామి ఆలయానికి వెళ్లారు మోదీ. ప్రత్యేక పూజలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+