అయోధ్య బాల రాముడికి లస్సీ, ఫ్రూట్ జ్యూస్- పువ్వుల హారతి.. సేవల్లో మార్పు వెనుక..!!
అయోధ్య రామ్ లల్లా సేవా విధానంలో మార్పులు చేసారు. బాల రాముడిగా పూజలు అందుకుంటు న్న రామ్ లల్లాను రాజ కుమారుడిలా సేవలు కొనసాగుతున్నాయి. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భోగాల్లో మార్పులు చేసి, చల్లదనం కలిగించే పదార్థాలను సమర్పిస్తున్నారు. వేడి నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నూలు వస్త్రాలను మాత్రమే రామ్ లల్లాకు ధరింపజేస్తున్నారు.
ప్రస్తుతం వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భోగాల్లో మార్పులు చేసి, చల్లదనం కలిగించే పదార్థాలను సమర్పిస్తున్నారు.ఇప్పటివరకు ఖీర్, పూరీ, రబ్డీ, పెడా వంటి తీపి పదార్థాలను భోగంగా సమర్పించగా, ఇప్పుడు వాటి స్థానంలో పెరుగు, పండ్లు, జ్యూస్, లస్సీ వంటి తేలిక పాటి- చల్లదనం ఇచ్చే ఆహార పదార్థాలను ప్రతిరోజూ సమర్పిస్తున్నారు. అదేవిధంగా రామ్‌లల్లాకు నూలు వస్త్రాలతో అలంకరిస్తున్నారు. వేడి నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టారు. హారతి విధానంలో మార్పు చేసారు. పౌర్ణమి తర్వాత నుంచి దీపాలతో హారతి ఇవ్వడం నిలిపివేసి, పూలతో హారతి ఇస్తున్నారు. దీపాల వేడి రామ్ లల్లాకు తాకకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

వేసవి తీవ్రత కారణంగా నిర్ణయాలు
వేసవిని దృష్టిలో పెట్టుకుని 56 భోగాల్లో కూడా మార్పులు చేసి.. అవసరమైన నిర్ణయాలను ఆలయ అధికారులు అమలు చేస్తున్నారు. కాగా.. రామాలయంలో తొలిసారిగా సీతమ్మ జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 25న వైశాఖ నవమి సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయంలోని మొదటి అంతస్తులో శ్రీరాముడితో పాటు సీతమ్మ విరాజమానంగా దర్శనం ఇస్తున్నారు. ఈ సందర్భంగా గర్భగుడిలో అలంకరణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈసారి వార్షిక క్యాలెండర్‌లో సీతమ్మ జన్మోత్సవాన్ని చేర్చటం ప్రత్యేక సందర్భంగా మారుతోంది. ప్రతి సంవత్సరం దేవతల తిథులకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications