అయోధ్యపై తీర్పు: సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేసిన నిర్మోహి అఖాడా
చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో క్రమంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇఛ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ హిందు మహాసభ రివ్యూ పిటీషన్ వేయాలని నిర్ణయించుకున్న కొద్దిరోజుల్లోనే మరో హిందూ పార్టీ.. నిర్మోహి అఖాడా కూడా అదే బాటలో నడిచింది. బుధవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసింది. దీనితో అయోధ్య తీర్పుపై ఇప్పటికే సుప్రీంకోర్టులో 12 రివ్యూ పిటీషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది.

అయోధ్యపై తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ..
తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసినట్లు నిర్మోహి అఖాడా అధికార ప్రతినిధి కార్తీక్ చోప్రా వెల్లడించారు. సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించినట్లు తెలిపారు. ఏ కారణంతో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేశారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. అందులో పొందుపరిచిన విషయాలను తెలియజేయడానికి నిరాకరించారు. రామజన్మభూమి ట్రస్టులో నిర్మోహి అఖాడాకా భాగస్వామ్యం కల్పించేలా చేయాలని కోరుతూ రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

నిర్మోహి అఖాడా సైతం కేసు కోసం పోరాడినా..
అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో హిందూ పార్టీల తరపున నిర్మోహి అఖాడా సైతం పోరాడిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్థలాన్ని తమకు కేటాయించాలని కోరుతూ నిర్మోహి అఖాడా సుప్రీంకోర్టులో పోరు సాగించింది. కిందటి నెల 9వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మాత్రం అఖాడాకు వ్యతిరేకంగా వచ్చిన విషయం తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామ్ లల్లా విరాజ్ మాన్ కు మాత్రమే చెందుతుందని తీర్పు ఇచ్చింది.

ముస్లింలకు స్థలాన్ని ఇవ్వడానికి వ్యతిరేకిస్తోన్న హిందు మహాసభ
ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపుపై అభ్యంతరం.. ముస్లిం పార్టీలకు అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించడాన్ని నిరసిస్తూ హిందూ మహాసభ సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయనున్న విషయం తెలిసిందే. న్యాయపరంగా, చట్టపరంగా వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతున్నప్పుడు.. ముస్లింలకు అయిదు ఎకరాలను ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీన్ని వెనక్కి తీసుకోవాలని తాము సుప్రీంకోర్టును కోరున్నట్లు హిందు మహాసభ తరఫు న్యాయవాది విష్ణుకుమార్ జైన్ తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications