• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లైవ్: రామ భక్తి, రహీం భక్తి కాదు.. దేశభక్తి భావాన్ని బలోపేతం చేయాలి.. అయోధ్య తీర్పుపై ప్రధాని

|

వివాదాస్పద అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించనున్నది. శనివారం (నవంబర్9వ తేదీన) ఉదయం 10.30 నిమిషాలకు జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెల్లడించనున్నది. ఈ బృందంలో జస్టిస్ ఎస్ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ ఈ బృందంలో ఉన్నారు.

అయోధ్య-బాబ్రీ మసీదు భూ వివాదంపై తుది తీర్పు వెలువడుతుండటంతో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొన్నది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆ అంశంపై తాజా అప్‌డేట్స్ కోసం..

Ayodhya Verdict Live Updates: Supreme Court to Pronounce Its Verdict at 10 30 Tomorrow

Newest First Oldest First
4:24 PM, 9 Nov
కరసేవకుల త్యాగాలు వృథా కాలేదు.. రాజ్ థాక్రే
అయోధ్యపై సుప్రీం తీర్పుతో చాలా సంతోషంగా ఉన్నాను. ఈ పోరాటంలో కరసేవకుల త్యాగాలు వృధా కాలేదు. వీలైనంత త్వరగా రామమందిరం నిర్మించాలి. రామాలయంతోపాటు దేశంలో రామరాజ్యాన్ని తీసుకురావాలన్నది నా కోరిక: ఎంఎన్ఎస్ ఛీప్ రాజ్ థాక్రే
4:17 PM, 9 Nov
సువర్ణాక్షరాలతో లిఖించదగినది
అయోధ్యపై సుప్రీం తీర్పు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ప్రతీ ఒక్కరికి సంతృప్తిని కలిగించింది. నవంబర్ 24వ తేదీన అయోధ్యకు వెళ్తున్నా.. ఉద్దవ్ థాక్రే
3:42 PM, 9 Nov
సుప్రీం తీర్పు సంతృప్తిని కలిగించలేదు.. ఓవైసీ
సుప్రీం తీర్పు సంతృప్తిని కలిగించలేదు.. ఓవైసీ
అయోధ్యపై సుప్రీం తీర్పు సంతృప్తిని కలిగించలేదు. మా లీగల్ హక్కుల కోసం పోరాటం చేస్తాం. ఐదెకరాల భూమి విరాళంగా మాకొద్దు.. అసదుద్దీన్ ఓవైసీ
1:17 PM, 9 Nov
గెలుపు, ఓటములుగా చూడొద్దు
అయోధ్యపై సుప్రీం తీర్పును గెలుపు, ఓటములుగా చూడొద్దు.. ఇక వివాదం ముగిసింది.. మోహన్ భగవత్
1:13 PM, 9 Nov
అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు వచ్చింది.. ఆర్ఎస్ఎస్
12:45 PM, 9 Nov
అయోధ్యపై 1045 పేజీల తీర్పు
అయోధ్యపై 1045 పేజీల తీర్పు
అయోధ్యపై 1045 పేజీల తీర్పు.. అసంతృప్తిని వ్యక్తం చేసిన బాబ్రీ యాక్షన్ కమిటీ
12:39 PM, 9 Nov
సుప్రీం తీర్పును అంతా గౌరవించాల్సిందే
రాముడిని రాజకీయాలకు వాడుకోవడం తగదు.. సుప్రీం తీర్పును అంతా గౌరవించాల్సిందే.. కాంగ్రెస్
12:36 PM, 9 Nov
సుప్రీంకోర్టు తీర్పు చారిత్రత్మకం
వివాదాస్పద అయోధ్య భూమిపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రత్మకం.. రాజ్‌నాథ్ సింగ్
12:13 PM, 9 Nov
బాబ్రీ కూల్చివేత రాజ్యాంగ విరుద్ధం
బాబ్రీ కూల్చివేత రాజ్యాంగ విరుద్ధం.. చట్టం అనుమతించదు.. సుప్రీంకోర్టు
11:33 AM, 9 Nov
సామరస్య స్ఫూర్తితో స్వీకరించాలి
అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును ప్రజాసామ్య, సామరస్య స్ఫూర్తితో స్వీకరించాలి. ప్రజలు శాంతి, సంయమనాన్ని పాటించాలి.. బీహార్ సీఎం నితీష్
11:21 AM, 9 Nov
మూడు నెలల్లోగా ట్రస్టు
మూడు నెలల్లోగా ట్రస్టును ఏర్పాటు చేయాలి.. ట్రస్టుకు 2.77 ఎకరాలు అప్పగించాలి.. సుప్రీంకోర్టు
11:17 AM, 9 Nov
రామజన్మభూమి న్యాస్‌కు వివాదాస్పద భూమి
రామజన్మభూమి న్యాస్‌కు వివాదాస్పద భూమి.. సున్నీ వక్ఫ్‌బోర్డుకు వేరేచోట 5 ఎకరాలు భూకేటాయింపు.. సుప్రీం
11:17 AM, 9 Nov
12 నుంచి 16 శతాబ్దంలో
12 నుంచి 16 శతాబ్దంలో అక్కడ ఏమి జరిగిందనే విషయంపై ఆధారాల్లేవు.. సీజే గొగోయ్
11:11 AM, 9 Nov
ముస్లింలకు వేరే చోట భూమి
వివాదాస్పద స్థలంలో కాకుండా ముస్లింలకు వేరే చోట భూమి కేటాయింపు.. సుప్రీంకోర్టు తీర్పు
11:09 AM, 9 Nov
అలహాబాద్‌ కోర్టు తీర్పును తప్పుపట్టిన సుప్రీం
అయోధ్య భూవివాదంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సుప్రీంకోర్టు
11:06 AM, 9 Nov
12 నుంచి 16 శతాబ్దంలో
12 నుంచి 16 శతాబ్దంలో అక్కడ ఏమి జరిగిందనే విషయంపై ఆధారాల్లేవు.. సీజే గొగోయ్
11:03 AM, 9 Nov
ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదు కట్టలేదు
ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదు కట్టలేదు. దేవాలయాన్ని ధ్వంసం చేశారనడానికి పురావస్తు శాఖ ఆధారాల్లేవు.. సీజే
10:37 AM, 9 Nov
అయోధ్య తీర్పుపై ఏకాభిప్రాయం
అయోధ్య తీర్పుపై ఏకాభిప్రాయానికి వచ్చిన ఐదుగురు జడ్జీలు.. షియా బోర్డు అప్పీల్ కొట్టివేత
10:32 AM, 9 Nov
కేసు పూర్వపరాలను చదవి
అయోధ్య కేసు పూర్వపరాలను చదవి వినిపించనున్న చీఫ్ జస్టిస్ గొగోయ్
10:24 AM, 9 Nov
అమిత్ షా భేటి
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కమిటీ, హోంశాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో అమిత్ షా భేటి
10:19 AM, 9 Nov
పిటిషనర్లకు మాత్రమే అనుమతి
పిటిషనర్లను మాత్రమే కోర్టులోపలికి అనుమతించిన సెక్యూరిటీ సిబ్బంది
10:17 AM, 9 Nov
కోర్టుకు చేరుకొన్న ఐదుగురు జడ్జీలు
కోర్టుకు చేరుకొన్న ఐదుగురు జడ్జీలు
కోర్టు రూం తలుపులు తెరిచిన సిబ్బంది.. తీర్పు చెప్పడానికి చేరుకొన్న ఐదుగురు జడ్జీలు
10:14 AM, 9 Nov
సుప్రీం చేరుకొన్న నిర్మోహి అఖాడా ప్రతినిధులు
సుప్రీంకోర్టుకు చేరుకొన్న పిటిషనర్ నిర్మోహి అఖాడా ప్రతినిధులు
10:02 AM, 9 Nov
సుప్రీంకోర్టుకు చేరుకొన్న చీఫ్ జస్టిస్
మరికాసేపట్లో అయోధ్యపై తీర్పు.. సుప్రీంకోర్టుకు చేరుకొన్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
9:54 AM, 9 Nov
సోదరభావంతో మెదగాలి
అయోధ్య తీర్పు రెండు వర్గాలకు సంతృప్తిని కలిగిస్తుందని భావిస్తున్నాను. ప్రజలందరూ మతాలకు అతీతంగా వ్యవహరించాలి. శాంతి, సద్భావన కోసం పాటుపడుతూ సోదరభావంతో మెదగాలి. మనమంత ఒక్కటే అని భావించాలి.. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ పిలుపు
9:37 AM, 9 Nov
అయోధ్యలో డజనకుపైగా కమిషనర్ల ఏర్పాట్లు
అయోధ్య తీర్పు నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు డజనకుపైగా కమిషనర్లను నియమించిన సీఎం ఆదిత్యానాథ్
9:32 AM, 9 Nov
అయోధ్య నుంచి యాత్రికుల తరలింపు
అయోధ్యలోని యాత్రికులను వారి స్వస్థలాలకు ప్రత్యేక బస్సులో తరలిస్తున్న అధికారులు
8:57 AM, 9 Nov
ఉత్తర్ ప్రదేశ్ నేపాల్ సరిహద్దులను మూసివేసిన యూపీ సర్కార్.సరైన గుర్తింపు కార్డు లేకుండా అక్కడ ప్రజలు సంచరించరాదన్న అడిషనల్ హోమ్ సెక్రటరీ అవనీష్ అవాస్తీ
8:46 AM, 9 Nov
అయోధ్య తీర్పు ఎలా ఉన్నప్పటికీ అంతా సంయమనంతో ఉండాలి.అయోధ్య తీర్పు ఏ ఒక్కరి విజయమో లేక ఓటమో కాదని ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారు: అయోధ్య ఆలయ పూజారి మహంత్ సత్యేంద్ర దాస్
8:44 AM, 9 Nov
సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ అందరూ సంయమనం పాటించాలి. న్యాయస్థానం అందరికీ సమ్మతమైన తీర్పు ఇస్తుందని భావిస్తున్నాను: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
READ MORE

English summary
Ayodhya Verdict Live Updates: Supreme Court to Pronounce Its Verdict at 10 30 Tomorrow
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X