• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అయోధ్య..అద్వానీ : రామ్‌ రథయాత్రతో రాజకీయ కుదుపు: బీజేపీకి దశనే మార్చేసింది..!

|

సుదీర్ఘ కాలం వివాదాస్పదంగా మారిన అయోధ్య వివాదానికి సుప్రీం తన తీర్పుతో ముగింపు పలికింది. ఈ సమయంలో బీజేపీ నేతలు పార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీని గుర్తు చేసుకుంటున్నారు. ఉమా భారతి..ఉద్దవ్ థాక్రే లాంటి వారు అద్వానీ ఘనతగా చాటుతున్నారు. అయితే, అద్వానీకి..అయోధ్యకు సంబంధం ఏంటి. నాడు రామ్ రధయాత్ర ద్వారా అద్వానీ దేశంలో బీజేపీ రూపురేఖలనే మార్చేసారు. ఆ పార్టీకి స్వర్ణయుగానికి నాంది ప్రస్థానం చేసారు.

నాటి నుండి నేటీ వరకు బీజేపీ అప్రతిహాతంగా ఎదగటంతో ఆనాటి అద్వానీ రధయాత్రే కీలకం. ఇక..బీజేపీ నేతల చిరకాల నినాదం అయోధ్యలో రామ మందిరం. ఇప్పుడు సుప్రీం తీర్పు ద్వారా అయోధ్యలో రామ మందిరానికి లైన్ క్లియర్ అయింది. దీనికి చట్ట పరంగా ఆమోదం లభించింది. ఈ సమయంలో అందరూ అద్వానీని గుర్తు చేసుకోవటం వెనుక అనేక చారిత్రక కారణాలు ఉన్నాయి. అందునా..అద్వానీ తన రధయాత్ర ద్వారా దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమయ్యారు.

రధయాత్రతో బీజేపీకి కొత్త ఊపు..

రధయాత్రతో బీజేపీకి కొత్త ఊపు..

బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ నాడు నిర్వహించిన రామ్‌ రథయాత్ర.. 1990 సెప్టెంబర్‌ నుంచి 1992 డిసెంబర్‌ 6 వరకూ సాగింది. అది.. దేశాన్ని రాజకీయంగా, సామాజికంగా తీవ్ర కుదుపునకు గురిచేసింది. బీజేపీ రూపురేఖలను మార్చి ఆ పార్టీ స్వర్ణయుగానికి నాంది పలకడమే కాకుండా.. మొత్తంగా బీజేపీకి కొత్త ఊపు ఇచ్చింది. బోఫోర్స్‌ సహా పలు ఆరోపణలతో 1989లో కాంగ్రెస్‌ పరాజయం పాలైంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మ్యానిఫెస్టోలో చేర్చిన బీజేపీ ఆ ఎన్నికల్లో 86 సీట్లు సాధించింది.

వీపీ సింగ్‌కు మద్దతివ్వటంతో

వీపీ సింగ్‌కు మద్దతివ్వటంతో

ఆయన నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ కొలువు తీరింది. ప్రభుత్వోద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ కల్పించడానికి ఉద్దేశించిన మండల్‌ కమిషన్‌ నివేదికను 1990 ఆగస్టు 7న సింగ్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అగ్రవర్ణాలు భగ్గుమన్నాయి. దీన్నో అవకాశంగా తీసుకుంది బీజేపీ. ఫలితమే 1990 సెప్టెంబర్‌ 12 అద్వానీ రథయాత్ర ప్రకటన. రాముడి జన్మ స్థలమైన అయోధ్యలో ఆలయం నిర్మాణానికి దేశవ్యాప్తంగా మద్దతు సాధించటమే లక్ష్యంగా 1990 సెప్టెంబర్‌ 25న గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయం నుంచి అద్వానీ రథయాత్ర ప్రారంభించారు.

అద్వానీ అరెస్ట్..మద్దతు ఉప సంహరణ

అద్వానీ అరెస్ట్..మద్దతు ఉప సంహరణ

అద్వానీ రధ యాత్ర దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. గుజరాత్ తరువాత అద్వానీ మహారాష్ట్రలోకి అడుగుపెట్టిన యాత్రకు శివసేన సంపూర్ణ మద్దతునిచ్చింది. తరవాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో సాగింది. ఢిల్లీ నుంచి ఉత్తర ప్రదేశ్‌ సరిహద్దులు దాటిన వెంటనే అద్వానీని అరెస్టు చేయాల్సిందిగా నాటి ప్రధాని వీపీ సింగ్‌ బిహార్‌ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌కి సూచించారు. అక్టోబర్‌ 23న అద్వానీని, నాటి వీహెచ్‌పీ అధినేత అశోక్‌ సింఘాల్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది.

వీపీ సింగ్‌ నేతృత్వంలోని

వీపీ సింగ్‌ నేతృత్వంలోని

అద్వానీ అక్టోబర్‌ 23న అరెస్ట్‌ అయిన వెంటనే బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో అటు కేంద్రంలో వీపీ సింగ్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం..మరో వైపు టు లాలూ ప్రసాద్‌ నేతృత్వంలోని బిహార్‌ ప్రభుత్వం కుప్పకూలాయి. 1990 నవంబర్‌ 7న సింగ్‌ ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసాన్ని కోల్పోయింది. కాంగ్రెస్‌ మద్దతుతో చంద్రశేఖర్‌ ప్రధాని కాగా.. 16 నెలలకే దిగిపోయారు. మళ్లీ ఎన్నికలొచ్చాయి.

అప్పుడే అద్వానీ ప్రధాని అయ్యేవారా..

అప్పుడే అద్వానీ ప్రధాని అయ్యేవారా..

ఈ పరిణామాల తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లు పెద్ద ఎత్తున అంచనాలు వినిపించాయి. బీజేపీ గెలుపు ఖాయమని..అద్వానీ ప్రధాని అవుతారని అంచనా వేసారు. అదే సమయంలో నిలిచాయి. మొదటి దఫా ఎన్నికలు పూర్తయిన మే 20వ తేదీ మర్నాడే తమిళనాడులో ఒక ఎన్నికల బహిరంగ సభలో ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌గాంధీ ప్రాణాలు కోల్పోయారు. దీనితో తర్వాతి ఎన్నికల తేదీలు జూన్‌ మధ్య వరకూ వాయిదా పడ్డాయి. జూన్‌ 12, 15 తేదీల్లో తదుపరి దశ జరిగాయి.

కాంగ్రెస్‌కు తగిన సీట్లను

కాంగ్రెస్‌కు తగిన సీట్లను

తొలి విడత 211 సీట్లకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ అతికొద్ది స్థానాలనే దక్కించు కోగలిగింది. జూన్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు తగిన సీట్లను సంపాదించి పెట్టాయి. ఫలితం కేంద్రంలో పీవీ నరసింహారావు నేతృత్వంలో మైనారిటీ సంకీర్ణం ఏర్పడింది. ఇక, ఆ తరువాత జరిగిన పరిణామాల్లో బీజేపీ క్రమేణా ఎదుగుతూ మోదీ నాయకత్వంలో వరుసగా రెండో సారి కేంద్రంలో అధికారం దక్కించుకంది. కానీ, అయోధ్య వ్యవహారంలో మాత్రం బీజేపీ నేతలు సైతం అద్వానీని కీర్తిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Some of the BJP senior leaders giving Ayodhya ramalayam credit to senior leader Advani. They remembering Ram Rahda yatra led by Adavani given big push up for BJP in nation wide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more