Baby: పురిటిబిడ్డ బరువు ఎంతో చూడాలని చెప్పి నకిలీ నర్సు ఎస్కేప్ , సీసీటీవీ కెమెరాల్లో ? !

బెంగళూరు/బెళగావి: మహిళకు రాత్రి పురిటినొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. రాత్రి మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ మొహం తండ్రి, అతని కుటుంబ సభ్యులు చూడనేలేదు. కడుపులో పుట్టిన బిడ్డను ఒక్కసారి మాత్రమే చూసుకున్న తల్లి మురిసిపోయింది. ఆసుపత్రిలో వార్డులో ఉన్న మహిళ దగ్గరకు వెళ్లిన యువతి నేను ఇక్కడ నర్సు, మీకు పుట్టిన బిడ్డ బరువు ఎంత ఉన్నాడో అని చూడాలని డాక్టర్ చెప్పారని ఆమె చెప్పింది. బిడ్డను ఎత్తుకుని వెళ్లిన యువతి మాయం అయ్యింది, నా బిడ్డ ఎక్కడ అంటూ ఆసుపత్రిలో ఉన్న సిబ్బందిని తల్లి అడిగింది. ఆసుపత్రిలో పని చేసే నర్సులు ఎవ్వరూ నీ బిడ్డను ఎత్తుకుని రాలేదని అక్కడి సిబ్బంది చెప్పడంతో ఆ తల్లి హడలిపోయింది.

 ఆసుపత్రిలో చేరిన మహిళ

ఆసుపత్రిలో చేరిన మహిళ

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని అథణిలో నివాసం ఉంటున్న మహిళకు బుధవారం రాత్రి పురిటినొప్పపులు వచ్చాయి. మహిళకు పురిటినొప్పులు రావడంతో ఆమెను అథణి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. రాత్రి 9 గంటల సమయంలో ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కడుపులో పుట్టిన బిడ్డను ఒక్కసారి మాత్రమే చూసుకున్న తల్లి మురిసిపోయింది.

 బిడ్డతో మాయం అయిన నకిలీ నర్సు

బిడ్డతో మాయం అయిన నకిలీ నర్సు

బిడ్డ మొహం తండ్రి, అతని కుటుంబ సభ్యులు చూడనేలేదు. ఆసుపత్రిలో వార్డులో ఉన్న మహిళ దగ్గరకు వెళ్లిన యువతి నేను ఇక్కడ నర్సు, మీకు పుట్టిన బిడ్డ బరువు ఎంత ఉన్నాడో అని చూడాలని డాక్టర్ చెప్పారని ఆమె చెప్పింది. తరువాత బిడ్డను ఎత్తుకుని వార్డు నుంచి బయటకు వెళ్లిన నకిలీ నర్సు ఆసుపత్రిలో నుంచి బయటకు వెళ్లి మాయం అయ్యింది.

 హడలిపొయిన తల్లి.... సీసీటీవీల్లో ?

హడలిపొయిన తల్లి.... సీసీటీవీల్లో ?

బిడ్డను ఎత్తుకుని వెళ్లిన యువతి మాయం అయ్యింది, నా బిడ్డ ఎక్కడ అంటూ ఆసుపత్రిలో ఉన్న సిబ్బందిని తల్లి అడిగింది. ఆసుపత్రిలో పని చేసే నర్సులు ఎవ్వరూ నీ బిడ్డను ఎత్తుకుని రాలేదని అక్కడి సిబ్బంది చెప్పడంతో ఆ తల్లి హడలిపోయి ఆర్తనాదాలు చేసింది. విషయం తెలుసుకున్న అథణి పోలీసులు ఆసుపత్రిలో, ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు.

 మహారాష్ట్ర నుంచి వచ్చి బిడ్డను ఎత్తుకెళ్లిన కిలాడీ లేడి

మహారాష్ట్ర నుంచి వచ్చి బిడ్డను ఎత్తుకెళ్లిన కిలాడీ లేడి

పసుపు రంగు పంజాబి డ్రెస్ వేసుకున్న యువతి బిడ్డను ఎత్తుకుని వెళ్లిందని గుర్తించిన పోలీసులు బెళగావి జిల్లా పోలీసులు అందరికి సమాచారం ఇచ్చారు. బిడ్డను ఎత్తుకుని పారిపోతున్న యువతి చిక్కోడిలో పోలీసులకు చిక్కిపోయింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని మహిశాళ గ్రామంలో నివాసం ఉంటున్న మాయా నీలాబాయి అలియాస్ నీలా (28) అనే యువతిని అరెస్టు చేసి బిడ్డను ఆమె తల్లికి అప్పగించామని పోలీసులు అన్నారు. సాంగ్లీ జిల్లా నుంచి వచ్చిన నీలాబాయి అప్పుడే పుట్టిన బిడ్డను ఎందుకు ఎత్తుకుని వెళ్లింది అని ఆమె చెప్పడం లేదని, విచారణ చేస్తున్నామని చిక్కోడి, అథణి పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+