ఆ కేఫ్ లో భగ్న ప్రేమికులకు బంపర్ ఆఫర్ ... క్యూ కడుతున్న లవ్ ఫెయిల్యూర్ బ్యాచ్

వాలెంటైన్స్ ... ప్రపంచం మొత్తాన్నీ తనకు అభిమానులుగా మార్చుకున్నారు.తాను మరణించిన రోజు వాలెంటైన్స్‌డేగా ప్రేమికులకు అంకితం అవుతుందని వాలెంటైన్ తన చివరి సందేశాన్ని రావి ఆకు మీద రాస్తే దాని ఆధారంగా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారని చెబుతుంది చరిత్ర. అందుకే ప్రేమలో పూర్తిగా మునిగిన వాళ్ల కోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఉంది. వాలెంటైన్స్ డే నాడు ప్రేమికులందరూ తమలో ఉన్న ప్రేమను ప్రేమికులకు వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తూ చాలా స్పెషల్ గా గడుపుతారు. ఒకరికి ఒకరు గిఫ్ట్ లను ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా, షాపింగ్ మాల్స్, బేకరీలు, రెస్టారెంట్లలో లవర్స్ కోసం బోలెడన్ని బంపర్ ఆఫర్లను ప్రకటిస్తారు. ప్రేయసీ ప్రియులు లోకాన్ని మరిచిపోయి తమ ప్రేమ లోకంలో విహరిస్తారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా ప్రేమ విఫలమై, మనసు శకలమైన వారి పరిస్థితేంటి? ప్రేమించిన వారిని మరచిపోలేక, వారితో ప్రేమను కొనసాగించలేక, వాలెంటైన్స్ డే వస్తే విపరీతంగా బాధ పడే వారి గురించి ఎవరు ఆలోచిస్తారు అంటే భగ్న ప్రేమికుల గురించి ఆలోచించే వారు కూడా ఉన్నారు. జబ్ ఉయ్ మెట్ సినిమాలో షాహిద్ కపూర్ ఫేమస్ సీన్ తలపించేలా ఒక ఆఫర్ చేసింది ఒక కేఫ్ .

Bangalore cafe bumper offer to the bitter lovers... a huge queue to the cafe

ఒకపక్క ప్రేమికులు ప్రేమలో మునిగి తేలుతుంటే, మరోపక్క భగ్న ప్రేమికులు తెగ బాధపడిపోతున్నారు. అలాంటి వారికోసం బెంగళూరులోని ఓ కేఫ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రేమికులను మోసం చేసిన, బ్రేకప్ చెప్పిన మాజీ లవర్స్ ఫోటోలను తగలబెడితే వారికి ఉచితంగా కేకులు, ఐస్ క్రీమ్ లు వంటి డెజర్ట్ ఇస్తామని ప్రకటన చేసింది. బెంగళూరు లోని కోరమంగళ రౌండప్ కేఫ్ చేసిన ఈ ప్రకటనతో భగ్న ప్రేమికులందరూ ఇప్పుడు ఈ కేఫ్ కు క్యూ కడుతున్నారు. మాజీ లవర్స్ ఫోటోలను తగలబెడుతూ, వారిని చూస్తూ కన్నీటిపర్యంతమవుతూ ఆ తర్వాత కేఫ్ లో కేక్ లు, ఐస్ క్రీమ్ లు తిని బాధ దిగమింగి వెళ్తున్నారు. కోరమంగళ రౌండప్ కేఫ్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ పాపులర్ కావడంతో భగ్న ప్రేమికులు ఈ కేఫ్ బాట పట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+