బెంగళూరులో ఎడిటర్ గౌరి లంకేష్ హత్య: పోలీసుల అదుపులో హంతకుడు అశోక్ !
Recommended Video

బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరి లంకేష్ హత్య కేసులో కర్ణాటక పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. గౌరి లంకేష్ హత్య కేసులో అనుమానిత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
బుధవారం చిక్కమంగళూరుకు చెందిన అశోక్ అనే వ్యక్తిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న అశోక్ మీద పోలీసులు నిఘా వేశారు. అతని కదలికలు గమనించిన పోలీసులకు అనుమానం వచ్చింది.

పారిపోవడానికి ప్రయత్నించిన అశోక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో గౌరి లంకష్ ను బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగరలోని ఐడిల్ హోమ్స్ లోని ఆమె ఇంటి దగ్గరే రివాల్వర్ కాల్చి హత్య చేసిన విషయం తెలిసిందే.
బెంగళూరులోని బసవనగుడి నుంచి రాజరాజేశ్వరి నగరలోని గౌరి లంకేష్ ఇంటి వరకు వెంబడించిన నిందితులు ఆమెను కాల్చి చంపారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. బసవనగుడి నుంచి రాజరాజేశ్వరి నగరలోని గౌరి లంకేష్ ఇంటి వరకు ఉన్న మొత్తం 33 సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.
అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల మీద పోలీసులు నిఘా వేశారు. నిందితుల కోసం గాలిస్తున్న సమయంలో చిక్కమగళూరుకు చెందిన అశోక్ పోలీసుల చేతికి చిక్కాడు. చిక్కమగళూరుకు చెందిన అశోక్ ను అదుపులోకి తీసుకున్నామని, గౌరి లంకేష్ హత్యతో అతనికి సంబంధం ఉందా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications