బంపర్ ఆఫర్: బెంగుళూరులో పనిచేసే టెక్కీలకు ఎక్కువ వేతనాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు:అత్యధిక వేతనాలు బెంగుళూరులో పనిచేసే టెక్కీలకు అత్యధిక వేతనాలు అందుతున్నాయి. అందుకే టెక్కీలు బెంగుళూరు బాట పడుతున్నారు. దేశంలో ఎక్కువ జీతాలు బెంగుళూరులో పనిచేసే టెక్కీలకు అందుతున్నాయని ర్యాండ్ స్టడ్ సర్వే వెల్లడించింది.

సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసే టెక్కీలకు వేతనాలు బాగానే ఉంటాయి.అయితే దేశంలోని ఇతర ప్రాంతాల్లోని సాఫ్ట్ వేర్ కంపెనీల కంటే ఎక్కువ వేతనాలు బెంగుళూరులోనే లభిస్తున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది.

దీంతో టెక్కీలంతా బెంగుళూరు వైపుకు వెళ్ళేందుకే ఆసక్తి చూపుతున్నారు.దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కంటే బెంగుళూరులోని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో జూనియర్లకు కూడ పెద్ద ఎత్తున జీతాలు చెల్లిస్తున్నాయి టెక్ కంపెనీలు.

బెంగుళూరును ఇండియాకు సిలీకాన్ వ్యాలీగా భావిస్తారు. అందుకేనేమో ఇక్కడ పనిచేసే టెక్కీలకు ఎక్కువ వేతనాలను చెల్లిస్తున్నారు.అయితే అన్ని రకాల కంపెనీలు కూడ ఇదే రకంగా టెక్కీలకు వేతనాలను చెల్లిస్తున్నాయి.

బెంగుళూరులో టెక్కీలకు జీతాలెక్కువ

బెంగుళూరులో టెక్కీలకు జీతాలెక్కువ

బెంగుళూరులో వాతావరణ పరిస్థితులు బాగా ఉంటాయనే కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎక్కువగా ఏర్పాటు చేశారు.అయితే అక్కడి వాతావరణ పరిస్థితులతో పాటు ప్రభుతు్వాలు ఇచ్చే రాయితీలు కూడ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏర్పాటుకు దోహదపడ్డాయి.

అయితే టెక్కీలకు మాత్రం అధిక జీతాల కారణంగానే బెంగుళూరు బాట పడుతున్నారు.బెంగుళూరులో 15 ఏళ్ళకు పైగా అనుభవం ఉన్న సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఏడాదికి సరాసరి 28 లక్షలు చెల్లిస్తుండగా, ముంబైలో 27 లక్షలు,హైద్రాబాద్ 26.8 లక్షలు చెల్లిస్తున్నారు.

ఢిల్లీ, పూణెలో కూడ తక్కువ జీతాలు

ఢిల్లీ, పూణెలో కూడ తక్కువ జీతాలు

టెక్కీలకు ఢీల్లీ, పూణెలలో కూడ తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని ర్యాండ్ స్టడ్ అనే సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. ఈ మేరకు తన సర్వే వివరాలను ఆ సంస్థ వెల్లడించింది.డీల్లీలోని ఎన్ సీఆర్ లో 26 లక్షలు చెల్లిస్తుండగా, పూణెలో మాత్రం 25.5 లక్షలను చెల్లిస్తున్నారని ఆ సంస్థ తన సర్వేలో వెల్లడించింది.

6 -10ఏళ్ళ అనుభవం ఉన్నవారికి కూడ

6 -10ఏళ్ళ అనుభవం ఉన్నవారికి కూడ

ఆరునుండి పదేళ్ళ అనుభవం ఉన్న మధ్యస్థాయి ఉద్యోగులకు కూడ ముంబైలో 10.5 లక్షలు, బెంగుళూరులో 10.4 లక్షలు, చెన్నైలో 10.3 లక్షలు,ఢీల్లీ-ఎన్ సీఆర్ లో 10.2 లక్షలు, హైద్రాబాద్ లో9.8 లక్షలు చెల్లిస్తున్నారు.

జూనియర్ ఉద్యోగులకు కూడ

జూనియర్ ఉద్యోగులకు కూడ

బెంగుళూరులో పనిచేసే జూనియర్ ఉద్యోగులకు కూడ ఎక్కువ జీతాలు చెల్లిస్తారు.బెంగుళూరులో 5.5 లక్షలు చెల్లిస్తున్నారు. ఢీల్లీలో పనిచేసే 5.3 లక్షలు, ముంబైలో 5.1 లక్షలు చెల్లిస్తున్నారు. హైద్రాబాద్ లో 4.9 లక్షల జీతం చెల్లిస్తున్నారని ఈ సర్వే తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Companies in India’s Silicon Valley pay more money than those in any other city in the country, with IT professionals receiving the biggest pay-cheques, a new survey by HR consulting firm Randstad shows
Please Wait while comments are loading...