Shock: యడియూరప్పకు షాక్ ఇచ్చిన బీజేపీ, కొడుక్కి డీసీఎం కాదు కదా మంత్రి పదవి కూడా గోవిందా !
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు బీజేపీ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. తన కుమారుడు బీవై, విజయేంద్రకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పదవి ఇప్పించాలని, లేదంటే మంత్రి పదవితో పాటు కీలకమైన శాఖలు అప్పగించాలని అనేక ప్రయత్నాలు చేసిన మాజీ సీఎం బీఎస్. యడియూరప్పకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 29 మంది మంత్రుల్లో తన కొడుకు కూడా ఒక్కడిగా ఉంటాడని ఊహించిన బీఎస్. యడియూరప్ప ఆశల మీద బీజేపీ హైకమాండ్ కోల్డ్ వాటర్ చల్లింది. ఉప ముఖ్యమంత్రి పదవి దేవుడు ఎరుగు, కనీసం మంత్రి పదవి కూడా దక్కకపోవడంతో బీఎస్. యడియూరప్ప, ఆయన కొడుకు విజయేంద్రతో పాటు ఆయన వర్గీయులు షాక్ అయ్యారు. బీజేపీ హైకమాండ్ బీఎస్. యడియూరప్ప, ఆయన కొడుకు విజయేంద్రతో మాట్లాడిందని, తనకు ఏమీ తెలీదని చెప్పిన కర్ణాటక ముఖ్యమంత్రి బవసరాజ్ బోమ్మయ్ సైలెంట్ గా తప్పించుకున్నారు.

ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని ?
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు బీజేపీలో సముచిత స్థానం ఇస్తామని బీజేపీ హైకమాండ్ హామీ ఇచ్చిందని సమాచారం. తనకు సీఎం పదవి దూరం అయినా తన కొడుకు బీవై. విజయేంద్రకు ఉప ముఖ్యమంత్రి పదవి కచ్చితంగా వస్తుందని బీఎస్. యడియూరప్ప ఊహించారు.

మంత్రి పదవి గోంవిందా గోవింద
ఉప ముఖ్యమంత్రి పదవి కాదు కదా కనీసం మంత్రి పదవి కూడా దక్కకపోవడంతో బీఎస్. యడియూరప్పతో పాటు ఆయన కొడుకు బీవై. విజయేంద్ర, యడియూరప్ప వర్గీయులు షాక్ అయ్యారు. యడియూరప్ప వేసుకున్న లెక్కలు తారుమారు కావడంతో ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు, నాయకులకు మైండ్ బ్లాక్ అయ్యింది.

యడియూరప్ప అనుకున్నది 100 % రివర్స్
బీఎస్. యడియూరప్ప అనుకున్నవి వంద శాతం రివర్స్ అయ్యాయని రాజకీయ నాయకులు అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి ఊడిపోయి 10 రోజులు కూడా కాకముందే బీజేపీ మీద యడియూరప్ప పట్టుకోల్పోయారని, ఇప్పుడు ఆయన గురించి బీజేపీ హైకమాండ్ పెద్దగా పట్టించుకోవడం లేదని ఆ రాష్ట్రంలోని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు.

అప్ప వర్గీయులకు బీజేపీ షాక్
యడియూరప్ప కొడుకు బీవై. విజయేంద్రతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న కొందరు బీజేపీ ఎమ్మెల్యేలకు బసవరాజ్ బోమ్మయ్ మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మంత్రి వర్గంలో బీఎస్. యడియూరప్ప వర్గీయులతో పాటు ఆయన వ్యతిరేక వర్గం వారికి కూడా చోటు దక్కింది.
Recommended Video

నాకేమీ తెలీదు స్వామి: సీఎం బోమ్మయ్ క్లారిటి
బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్రకు ఎందుకు మంత్రి పదవి దక్కలేదు అని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ని మీడియా ప్రశ్నించింది. బీజేపీ హైకమాండ్ బీఎస్. యడియూరప్పతో పాటు ఆయన కొడుకు బీవై. విజయేంద్రతో మాట్లాడింది. బీజేపీ హైకమాండ్ తనకు ఇచ్చిన ఆదేశాల మేరకు తాను 29 మందికి మంత్రి పదవులు అప్పగించానని, మిగిలిన విషయాలు తనకు ఏమాత్రం తెలీవని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తేల్చి చెప్పారు. ప్రియశిష్యుడు బసవరాజ్ బోమ్మయ్ సీఎం అయితే తనకు అంతా మంచే జరుగుతుందని ఊహించిన బీఎస్. యడియూరప్పకు ఇప్పుడు షాక్ మీద షాక్ తగులుతోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications