కలరా కలకలం, ఐటీ హబ్ లో హైఅలర్ట్, హోటల్స్, రెస్టారెంట్, కేఫ్ ల్లో ఇలాగే చెయ్యాలి, లేదంటే !
బెంగళూరు సిటీలో కలరా వ్యాధి తీవ్రరూపం దాల్చిందని వెలుగు చూడటంతో బీబీఎంపీ అధికారులు అలర్ట్ అయ్యారు. బెంగళూరులో కలరా కేసులు నమోదు కావడంతో అనుమానితుల నమూనాలను పరీక్షిస్తున్నారు. ఇలాంటి కేసులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుండడంతో బీబీఎంపీ అప్రమత్తమైంది. బెంగళూరు వాసులకు కొన్ని చర్యలు చేపట్టాలని బీబీఎంపీ అధికారులు పలు సూచనలు చేశారు.
మార్చి 30వ తేదీన బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) పరిధిలోని మల్లేశ్వర్‌లో నివాసం ఉంటున్న 27 ఏళ్ల మహిళ అతిసారం, వాంతుల లక్షణాలతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు చికిత్స అందించిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు ఆ మహిళకు కలరా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ వైద్యుడు ఈ విషయాన్ని సమీప నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రాథమిక సమాచారం అందించాడు.

ప్రాథమిక పరీక్షల్లో కలరా పాజిటివ్‌గా తేలింది. అప్పుడు లేబొరేటరీ పరీక్ష (మలం నమూనా పరీక్ష) ప్రతికూల నివేదికతో తిరిగి వచ్చింది. కలరా వచ్చిందనే అనుమానిత మహిళ ఇటీవలి రోజుల్లో ఎటువంటి ప్రయాణం చెయ్యలేదని, ప్రభావిత ప్రాంతాలను సందర్శించలేదని, బయట ఎక్కడా భోజనం చేయలేదని బీబీఎంపీ అధికారులు తెలియజేశారు. కలరా వ్యాప్తించిన మహిళ నివాసం ఉంటున్న ప్రాంతానికి బీబీఎంపీ అధికారులు వెళ్లారు.
కలరా వచ్చిందంటున్న అనుమానాస్పద మహిళ నివసించిన స్థలం చుట్టూ ఉన్న 165 ఇళ్లను సందర్శించిన బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు సర్వే చేశారు. వ్యాధుల వ్యాప్తి, పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత, స్వచ్ఛమైన నీటి వినియోగం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రజలకు జాగ్రత్తలు అందించారు. ఆ 165 ఇళ్లలో నివాసం ఉంటున్న వాళ్లకు ఎలాంట కలరా లక్షణాలు లేవని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

కలరా సోకిన ప్రాంతం నుండి 10 నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రయోగశాలకు పంపారు. నివేదిక వచ్చిన తర్వాత మరింత సమాచారం తెలియనుందని బీబీఎంపీ అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రజలకు కలరా వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు మనవి చేశారు.
అంటువ్యాధులను అరికట్టడానికి బెంగళూరులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని అన్ని ఆరోగ్య శాఖ అధికారులు, ఆరోగ్య వైద్యాధికారులను ఆదేశించారు. బెంగళూరు నగరంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్ యజమానులు వినియోగదారులకు వేడిచేసిన తాగునీటిని పంపిణీ చేయాలని బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. ఆరోగ్య శాఖ ఆదేశాలను గాలికి వదిలేసి అంటు వ్యాధులు వ్యాపించడానికి కారణం అయిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బీబీఎంపీ అధికారులు హెచ్చరించారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications