Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Beautiful wife: భార్య దొండపండులా ఉందని భర్తకు అనుమానం, అర్దరాత్రి ఒకే సారి, ఆవేశం తట్టుకోలేక !

చెన్నై/ కాంచీపురం: భార్య మీద అనుమానంతో భర్త రోజు ఇంట్లో టార్చర్ పెట్టాడు. ప్రతిరోజూ ఇంట్లో భార్య,భర్తల మద్య ఇదే పంచాయితీ జరిగింది. పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా దంపతుల రామాయణం ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు వాళ్లకు చెప్పిచెప్పి విసిగి అయారు. ఇక లాభం లేదని భావించిన భార్య ఆవేశంతో అర్దరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్ రూమ్ కు వెళ్లాలని నిద్రలేచిన భర్త తన భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి పోలీసుల భయంతో ఏం చెయ్యాలో అర్థంకాక సతమతం అయిపోయి నిద్రమత్తులో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

 కాంచీపురంలో దంపతులు

కాంచీపురంలో దంపతులు

తమిళనాడులోని కాంచీపురం సమీపంలోని కుప్పమ్మల్ వినాయకపురంలో కదిరివేల్, మణిమంగలై దంపతులు నివాసం ఉంటున్నారు. కదిరివేల్, మణిమంగలై దంపతులకు ముత్తు (8) అనే కుమారుడు, సుహాసిని (4) అనే కుమార్తె ఉన్నారు. పెళ్లి జరిగిన తరువాత కదిరివేల్, మణిమంగలై దంపతులు హ్యాపిగా సంసారం చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత వీరి సంసారం కొంతకాలం సాఫీగానే సాగిపోయింది.

 భార్య దొండపండులా ఉందని ?

భార్య దొండపండులా ఉందని ?

మణిమంగలై చూడటానికి ఎర్రగా, బొద్దుగా ఉంటుంది. కదిరివేల్ కాంచీపురంలోనే టైల్ వ్యాపారం చేస్తున్నాడు. ఉదయం నిద్రలేచి ఇంట్లో టిఫిన్ చేసి వ్యాపారం చెయ్యడానికి బయటకు వెళ్లే కదిరివేల్ రాత్రి ఇంటికి వెళ్లేవాడు. ఇదే సమయంలో చూడటానికి దొండపండులా ఉండే భార్య మణిమంగలై తనతో కాకుండా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త కదిరివేల్ కు అనుమానం పెరిగిపోయింది.

 ఓసేయ్..... నిన్ను లేపేస్తా

ఓసేయ్..... నిన్ను లేపేస్తా

రాత్రి ఇంటికి వెలుతున్న కదిరివేల్ నేను ఇంట్లో లేని సమయంలో ఎవరెవరు వచ్చి వెలుతున్నారు ? వాళ్లకు నీతో ఏం పని అంటూ భార్య మణిమంగలైతో గొడవపడేవాడు. తాను ఎవరితో తిరగడం లేదని, నువ్వు తప్పా నాతో ఎవ్వరూ సంసారం చెయ్యడం లేదని, అనవసరంగా గొడవలు చెయ్యకూడదని భార్య మణిమంగలై భర్త కదిరివేల్ కు ఎదురుతిరిగింది.

 విసిగిపోయిన ఫ్యామిలీ

విసిగిపోయిన ఫ్యామిలీ

ఇలా కొంతకాలం నుంచి కదిరివేల్, మణిమంగలై దంపతుల మద్య గొడవలు తారస్థాయికి చేరాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కదిరివేల్, మణిమంగలై దంపతులకు బుద్దిమాటలు చెబుతూ వచ్చినా వారి మద్య గొడవలు మాత్రం తగ్గలేదు. మీ చావు మీరు చావండి అంటూ బంధువులు కూడా కదిరివేల్, మణిమంగలైని వదిలేశారు.

 అర్దరాత్రి భర్తకు షాక్

అర్దరాత్రి భర్తకు షాక్

అక్రమ సంబంధం అనుమానం విషయంలోరాత్రి గొడవ పడిన కదిరివేల్, మణిమంగలై తరువాత రెండు గదుల్లోకి వెళ్లి నిద్రపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత మణిమంగలై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అర్దరాత్రి దాటిన తరువాత బాత్ రూమ్ కు వెళ్లాలని నిద్రలేచిన కదిరివేల్ భార్య ఉరి వేసుకున్న విషయం గుర్తించి షాక్ అయ్యాడు.

Recommended Video

    Indian-American Mala Adiga Appointed As Jill Biden's Policy Director
     పోలీసుల భయంతో భర్త ఆత్మహత్య

    పోలీసుల భయంతో భర్త ఆత్మహత్య

    ఎక్కడ పోలీసులు పట్టుకుని జైలుకు పంపిస్తారో అనే భయంతో ఆందోళన చెందిన కదిరివేల్ గట్టిగా కేకలు వేస్తూ వేరే గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కదిరివేల్ కేకలు వెయ్యడంతో బంధువులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకే రోజు తల్లిదండ్రలు ఆత్మహత్య చేసుకోవడంతో కదిరివేల్, మణిమంగలై ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+