బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిందపడ్డ మహిళకు ప్రసవం చేసిన బిచ్చగత్తె, అభినందనలు

కర్నాటక రాజధాని బెంగళూరులో బిజీ జంక్షన్‌లో ముప్పై ఏళ్ల ఓ మహిళకు అరవై ఏళ్ల బిచ్చగత్తె ప్రసవం చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఆ నిండు గర్భిణీ బస్సు ఎక్కబోతూ రోడ్డుపై కిందపడి అక్కడే ప్రసవించింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో బిజీ జంక్షన్‌లో ముప్పై ఏళ్ల ఓ మహిళకు అరవై ఏళ్ల బిచ్చగత్తె ప్రసవం చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఆ నిండు గర్భిణీ బస్సు ఎక్కబోతూ రోడ్డుపై కిందపడి అక్కడే ప్రసవించింది.

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని మాన్వీ టౌన్ జంక్షన్‌లో జరిగింది. సన్నా బజార్ కు చెందిన రైతు రామన్న భార్య ఎల్లమ్మ నిండు గర్భిణీ. ఎల్లమ్మకు రక్తం తక్కువగా ఉందని రాయచూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సు (రిమ్స్)కు వెళ్లాలని స్థానిక వైద్యులు సూచించారు.

Beggar, 60, helps woman deliver baby girl at busy junction

దీంతో ఎల్లమ్మ భర్తతో కలిసి రిమ్స్‌కు వచ్చి పరీక్షలు చేయించుకొని తమ గ్రామానికి తిరుగు పయనమయ్యారు. ఎల్లమ్మ బస్సు ఎక్కుతుండగా జంక్షన్ లోని రోడ్డుపైనే జారి కిందపడిపోయింది. రక్తం స్రావం జరిగింది. భర్తకు ఏం చేయాలో తోచలేదు.

అంతలో రోడ్డుపై ఉన్న అరవైఏళ్ల యాచకురాలు వచ్చి ఎల్లమ్మకు రోడ్డుపైనే పురుడు పోసింది. ఎల్లమ్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమయానికి వచ్చి పురుడు పోసిన యాచకురాలిని అందరూ అభినందించారు. ఎల్లమ్మతో పాటు శిశువును మాన్విలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

English summary
It had all the trappings of the routine recital of apathy and inhumanity when 30-year-old Yellamma, who was pregnant, collapsed in the middle of a busy junction in Manvi town of North Karnataka's Raichur district. But what unfolded instead conveyed a vast array of emotions that hinged on kindness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X