బెంగళూరులో 25 మంది విదేశీయులు అరెస్టు, అర్దరాత్రి పోలీసులు ఎంట్రీ, ఏం చేశారంటే ?
బెంగళూరు సిటీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి అక్రమంగా ఉంటున్న 25 మంది బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు.
అర్థరాత్రి రామమూర్తినగర్, మారతహళ్లి, బెళ్లందూరు, బండేపాళ్య, వర్తూర్, హెబ్బగోడి పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమంగా ఉంటున్న 25 మంది బంగ్లాదేశ్ పౌరులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సమయంలో బంగ్లాదేశ్ జాతీయులు బస చేసిన షెడ్లలో ముఖ్యమైన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లును బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గత 20 ఏళ్లుగా బెంగళూరు నగరంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరుడు నూరుల్లా ఈ స్మగ్లర్లకు కింగ్‌పిన్ అని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు. వీరంతా నురుల్లా ద్వారా ఇండియాకు వచ్చి అక్రమంగా బెంగళూరు నగరంలో స్థిరపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు.
అరెస్టు అయిన వాళ్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగించేవారని పోలీసులు అన్నారు. వీరిలో ఇద్దరు నగరంలో దోపిడీ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లినట్లు పోలీసు అధికారుల విచారణలో తేలింది.
ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు అన్నారు. బెంగళూరు సీసీబీ దాడిలో పట్టుబడిన ఈ 25 మంది బంగ్లాదేశ్ పౌరులు అని అధికారులు తెలిపారు.
వీరి వివరాలను ఫారిన్ అర్బన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)కి సమర్పించనున్నారు. ఈ మేరకు బెంగళూరు సీసీబీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఐటీ హబ్ బెంగళూరు నగరంలో జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది. ప్రతినిత్యం బెంగళూరు వచ్చి ఏదో ఒకపని చేసి జీవనం సాగించాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో బాంగ్లాదేశ్ కు చెంది చాలా మందిని స్మగ్లర్లు బెంగళూరు తీసుకు వస్తున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications