New Year: ఐటీ హబ్ లో తాగుబోతుల కోసం స్పెషల్ అంబులెన్స్, ఫస్ట్ టైమ్, ఊగుడే ఊగుడు !
బెంగళూరు: నూతన సంవత్సరం వేడుకలు దగ్గరకు వచ్చేశాయి. కొత్త సంవత్సరాన్ని ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో కరోనా మరో సారి పంజా విసురుతుంది అనే భయంతో ఉన్నప్పటికీ ప్రజలలో మాత్రం న్యూఇయర్ సంబరాల ఉత్సాహం ఏమాత్రం ఇంచి కూడా తగ్గలేదు. మరోవైపు ఐటీ హబ్ పోలీసులు ఓ శుభవార్త అందించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్‌లో ఎంజాయ్ చేసి తాగి రోడ్డున పడే వారికోసం ఐటీ హబ్ లోని నార్త్ ఈస్ట్, ఈస్ట్ డివిజన్ పోలీసులు కొత్త అంబులేన్స్ సర్వీస్‌ను అందించడానికి రంగం సిద్దం చేస్తున్నారు. తాగుబోతుల కోసమే ప్రత్యేకంగా అంబులెన్స్ సేవలు ప్రారంభం అయ్యాయని మ్యాటర్ బయటకు రావడంతో డిసెంబర్ 31వ తేదీ పీలదాక తాగేయాలని తాగుబోతులు రెఢీ అయిపోతున్నారని తెలిసింది.

బెంగళూరులో గ్రాండ్ గా న్యూఇయర్ వేడుకలు
మద్యం మత్తులో రోడ్డుపై పడిపోయే వారి కోసం బెంగళూరు పోలీసులు అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేయనున్నారు. అయితే డిసెంబర్ 31 రాత్రికి మాత్రమే ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుందని ఓ అధికారి అంటున్నారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో రాష్ట్రంలో డిసెంబర్ 31 అర్దరాత్రి 1 గంట తర్వాత నూతన సంవత్సర వేడుకలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.

పబ్ లు, బార్ల దగ్గర అధిక సంఖ్యలో పోలీసులు
అంటువ్యాధులు మరింత వ్యాప్తి చెందకుండా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. బెంగళూరు ఆగ్నేయ విభాగంలో 108 పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఎక్కువగా ఉన్నాయి. పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్, బార్ ల దగ్గర పోలీసు సిబ్బందిని మోహరించి పూర్తి భద్రతను ఏర్పాటు చేస్తున్నామని ఆ విభాగం డీసీపీ సీకే బాబా తెలిపారు.

తాగుబోతుల కోసం అంబులెన్స్ లు
బెంగళూరు సౌత్ ఈస్ట్ డివిజన్ లోని కోరమంగళ, మడివాళ, ఎలక్ట్రానిక్ సిటీ, హెచ్ ఎస్ ఆర్ లేఅవుట్ లో పూర్తి పోలీసు భద్రతకు సన్నాహాలు ఇప్పటి నుంచి మొదలైనాయి. కొత్త సంవత్సరం అర్దరాత్రి మద్యం తాగి స్పృహతప్పి పడిపోయిన వారికి, మద్యం మత్తులో రోడ్డు మీద పడి గాయపడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ప్రత్యేకంగా అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేస్తున్నారు.

పెద్ద ఈవెంట్ లు ఎక్కడ జరుగుతున్నాయి ?
పెద్దపెద్ద ఈవెంట్‌లు ఖచ్చితంగా అవుట్‌డోర్‌లో నిర్వహించాలని, వీలైనంత వరకు వెలుతురులో నిర్వహించాలని, అర్థరాత్రి దాటిన తరువాత న్యూఇయర్ వేడుకల్లో పాల్గోనే వారు తెల్లవారుజామున వరకు అక్కడ ఉండకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. చలికి లేనిపోని ఇబ్బందులు ఎదురౌతాయని ఇప్పటికే వైద్యులు చెప్పారు. హోటళ్లు, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్‌లు, రిసార్ట్‌లు మొదలైన ఇండోర్ ప్రాంతాల్లో అధికారులు సూచించిన సీటింగ్ కెపాసిటీని మించకూండా చూసుకోవాలని, కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని పోలీసు అధికారులు సూచించారు.

రెండు డోసుల కరోనా టీకాలు వేసుకోవాలి
ఈవెంట్ కార్యక్రమ నిర్వాహకులు, అక్కడి సిబ్బంది కచ్చితంగా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ను స్వీకరించి ఉండాలని అధికారులు సూచించారు. ఇండోర్ ఈవెంట్ లు జరిగే ప్రాంతాల్లో అందరూ కచ్చితంగా మాస్క్‌లు వేసుకోవాలని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అన్నీ సిద్దం చేసుకోవాలి, లేదంటే ?
పెద్ద ఈవెంట్‌ల నిర్వాహకులు అంబులెన్స్ సేవల కోసం సమీపంలోని ఆసుపత్రిని ముందుగానే సంప్రధించి అందుకు తగ్గ ఏర్పాటు చేసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. ఈవెంట్‌లో అనారోగ్యానికి గురైన వ్యక్తిని వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు ఈవెంట్ నిర్వహకులే చూసుకోవాలని, ఎవరైనా నియమాలు పాటించకపోతే కచ్చితంగా వరి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బెంగళూరు సిటీ పోలీసు అధికారులు హెచ్చరించారు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో నివాసం ఉంటున్న వారు భారీ సంఖ్యలో బెంగళూరులో జరిగే న్యూఇయర్ వేడుకులకు హాజరౌతారు.
-
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications