గజకేసరి రాజయోగంతో ఈ రాశుల దశ, దిశ మారుతోంది
ఖగోళంలో అద్భుత గ్రహాల కదలికల వల్ల జూలై 1, 2, 3 తేదీల్లో అత్యంత అరుదైన 'గజకేసరి రాజయోగం' ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈ మూడు రోజుల పాటు మకర రాశిలో సంచరించే చంద్రుడిపై.. ఏడవ ఇంట ఉన్న గురు, శుక్ర గ్రహాల పరిపూర్ణ వీక్షణం పడనుంది. గురు-చంద్రుల కలయికతో ఏర్పడే ఈ మహాయోగం వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి.
ఆదాయ మార్గాలు ఊహించని విధంగా పెరగడం, సమాజంలో తిరుగులేని స్థాయి లభించడం ఈ యోగం ముఖ్య లక్షణం. గ్రహాల అనుకూలతతో రాబోయే మూడు రోజుల్లో అపారమైన లక్ష్మీకటాక్షాన్ని పొందబోతున్న ఆ అదృష్ట రాశుల విశేషాలను తెలుసుకుందాం.

తులా రాశి
తులా రాశి వారికి నాలుగో స్థానంలో ఉన్న చంద్రుడిని, పదో ఇంట ఉన్న మూడు శుభ గ్రహాలు బలంగా వీక్షిస్తున్నాయి. ఈ ప్రభావంతో కెరీర్ పరంగా మీ హోదా పెరిగే భారీ అవకాశాలు ఉన్నాయి. కార్యాలయాల్లో పైఅధికారుల మద్దతు లభిస్తుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబంలో పండగ వాతావరణం ఉంటుంది.
మీన రాశి
మీన రాశి వారికి చంద్రుడి అనుకూల స్థానానికి గురు, బుధ, శుక్రుల శక్తులు తోడవ్వడంతో పటిష్టమైన రాజయోగం పడుతోంది. వీరు సమాజంలో అత్యంత కీలకమైన వ్యక్తులుగా ఎదుగుతారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉన్నత పదవులు, తిరుగులేని పలుకుబడి దక్కుతాయి. ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి ధనం చేతికి అందుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి గ్రహాల సంచారం అద్భుతమైన 'కుబేర యోగాన్ని' తెచ్చిపెడుతోంది. గురువు ఉచ్చ స్థితిలో ఉండటం, దానికి తోడు ఏడవ ఇంట బుధ, శుక్రుల సంపూర్ణ దృష్టి పడటం వల్ల సమాజంలో రాజపూజ్య గౌరవాలు దక్కుతాయి. వ్యాపారాల్లో ఊహించని లాభాలు వస్తాయి. పట్టిందల్లా బంగారమై నిలిచే రోజులివి.
కన్య రాశి
కన్య రాశి వారికి పంచమ స్థానంలో చంద్రుడి సంచారం, దానికి తోడు ఉచ్చ స్థానాల్లో ఉన్న గురు, బుధ, శుక్రుల అనుకూల దృష్టి వల్ల కాలం కలిసి రానుంది. శత్రువుల రేఖలు బలహీనపడతాయి. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు, అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా స్థిరపడటానికి కొత్త మార్గాలు సుగమమవుతాయి.
మేష రాశి
మేష రాశికి చెందిన వారికి దశమ స్థానంలో ఉన్న చంద్రుడిపై నాలుగో ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న శుభ గ్రహాల దృష్టి పడుతోంది. దీనివల్ల నిరుద్యోగుల కలలు నిజమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు, ఊహించని జీతాల పెరుగుదల ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్న వారికి వీసా లైన్ క్లియర్ అవుతుంది. ఆదాయం గతంలో కంటే రెట్టింపవుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, కీలకమైన పెట్టుబడులు పెట్టాలన్నా ఈ మూడు రోజులు అత్యంత ప్రశస్తమైన సమయమని గ్రహ గోచారం స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications