BMW bike: రూ. 16 లక్షల బైక్ కొంటామని, ట్రైల్ చూడాలని ఏం చేశారంటే ?, మైండ్ బ్లాక్ !
బెంగళూరు: ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు, బైక్ లో, రేంజ్ రోవర్, ఆడి కార్లు విక్రయించడానికి సెకండ్ హ్యాండ్ షోరూమ్ లు ప్రారంభించి వ్యాపారం చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఇద్దరి మద్య వ్యాపారంలో పోటీ ఉంది. గతంలో ఇద్దరి మద్య మాటల యుద్దం కూడా జరిగింది.
ఇదే సమయంలో సినిమా లెవల్లో ఓ స్టోరీ జరిగింది. బెంగళూరు సిటీలోని విజయనగర్ క్లబ్ రోడ్డులో మోహమ్మద్ ఆసీఫ్ అనే వ్యక్త సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ నిర్వహిస్తున్నాడు. బెంగళూరు గ్రామీణ జిల్లా దొడ్డబళ్లాపురంలో విశ్వాస్ అనే యువకుడు చాలా సంవత్సరాల నుంచి సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ నిర్వహిస్తున్నారు.

వ్యాపారంలో విశ్వాస్ కు, మోహమ్మద్ ఆసీఫ్ కు పోటీ ఉంది. ఇద్దరూ ఖరీదైన కార్లు, బైక్ లో విక్రయించడంతో పోటీ ఇంకా పెరిగింది. మోహమ్మద్ ఆసీఫ్ దగ్గర రూ. 16 లక్షల విలువైన బీఎండబ్ల్యూ బైక్ సేల్ కు ఉందని విశ్వాస్ కు తెలిసింది. ఆసీఫ్ కు వ్యాపారంలో దెబ్బ కొట్టాలని విశ్వాస్ స్కెచ్ వేశాడు. తనకు బీఎండబ్ల్యూ బైక్ కావాలని విశ్వాస్ ఫోన్ చేసి ఆసీఫ్ కు చెప్పాడు.
రూ. 16 లక్షలు ఇస్తే బైక్ ఇస్తానని ఆసీఫ్ చెప్పాడు. విశ్వాస్, అతని స్నేహితులు కొందరు కారులో బెంగళూరులోని విజయనగర క్లబ్ రోడ్డులోని ఆసీఫ్ ఇంటి దగ్గరకు వెళ్లారు. బైక్ ట్రైల్ చూడాలని ఆసీఫ్ కు చెప్పాడు. డబ్బు మొత్తం సెటిల్ చేస్తేనే ట్రైల్ చూడటానికి అంగీకరిస్తానని, లేదంటే బైక్ ఇవ్వనని ఆసీఫ్ తేల్చి చెప్పాడు.
ఆ సందర్బంలో సహనం కోల్పోయిన విశ్వాస్, అతని స్నేహితులు కలసి ఆసీఫ్ ను చితకబాదేసి రూ. 16 లక్షల బైక్ తో ఒకరు పరారైనాడు. దెబ్బలు తట్టుకోలేక ఆసీఫ్ కేకలు వేశాడు.స్థానికులు ఆసీఫ్ ఇంటి దగ్గరకు రావడంతో భయపడి విశ్వాస్ అతని అనుచురులు వారు వెళ్లిన కారు అక్కడే వదిలేసి తప్పించుకుని పరారైనారు. ఆసుపత్రిలో చేరిన ఆసీఫ్ సమాచారం ఇవ్వడంతో పోలీసుు విశ్వాస్ తో పాటు అతని ఐదు మంది స్నేహితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications