Coronavirus: ఉప ముఖ్యమంత్రి కొడుక్కి సీరియస్, విమానంలో హైదరాబాద్ షిఫ్ట్, ఫ్యామిలీలో 8 మంది !

హైదరాబాద్/ బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుటుంబ సభ్యులు హడలిపోయారు. ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుటుంబ సభ్యులు 8 మంది కరోనా వైరస్ (COVID-19) వైద్యపరీక్షలు చేయించుకోవడంతో అందరూ ఆ మహమ్మారి బారినపడ్డారు. ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుమారుడు డాక్టర్ గోపాల్ కరజోళ (43) కు కోవిడ్ 19 పాజిటివ్ అని తేలడం, వెంటిలేటర్ పై ఉన్న ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించారు.

ఇటీవల కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో పాటు ఆయన కుమార్తె, ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్ బారినపడి చికిత్స చేయించుకుని ఆ మహమ్మారి వ్యాధిని నయం చేసుకున్నారు.

 Bengaluru: Karnataka deputy CM’s COVID- positive son airlifted to Hydarabad, 7 other family members infected

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ ఈ విషయంపై ట్విట్ చేశారు. తన కుమారుడు డాక్టర్ గోపాల్ కరజోళ గత 23 రోజుల నుంచి కరోనా వైరస్ వ్యాధితో బాధపడుతూ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడని విచారం వ్యక్తం చేశారు. తాను 19 రోజుల పాటు కరోనా వైరస్ చికిత్స చేయించుకుని వ్యాధి నయం చేసుకున్నానని, తన భార్య కరోనా వైరస్ నుంచి కోలుకుందని, తన కుటుంబంలో మొత్తం 8 మంది కరోనా వైరస్ బారినపడ్డామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ ట్విట్ చేశారు.

కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలోని ముధోల్ నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ ఆ జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా పని చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుమారుడు డాక్టర్ గోపాల్ కరజోళ 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో నాగాథన్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత 23 రోజుల నుంచి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న గోపాల్ కరజోళకు వ్యాధి నయం కాకపోతే ఆయన ఉపిరితిత్తులు మార్చవలసి ఉంటుందని వైద్యులు సూచించారని కర్ఱాటక ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+