బెంగళూరు మెట్రో రైల్వే స్టేషన్ లో ఏం జరిగిందంటే ?, వీడియో బయట పెట్టిన మహిళ !
బెంగళూరులోని జాలహళ్లి మెట్రో స్టేషన్‌లో మహిళా ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించిన సెక్యూరిటీ గార్డును బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్‌సీఎల్) బుధవారం సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బెంగుళూరు నమ్మ మెట్రో రైలు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల కాలంలో బెంగళూరు నమ్మ మెట్రో రైలుకు సంబంధించిన వివాదాస్పద వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు మహిళా ప్రయాణికుల పట్ల బెంగళూరు మెట్రో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. అదేవిధంగా మహిళా ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించిన బెంగళూరు మెట్రో సిబ్బందిని బీఎంఆర్‌సీఎల్ సస్పెండ్ చేసినట్లు కన్నడ మీడియా తెలిపింది. మార్చి 17వ తేదీన జరిగిన ఈ ఘటనతో మహిళ ప్రయాణికులు మెట్రో రైలుకు సంబంధించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ మహిళ తన ఫిర్యాదును మెట్రో అధికారులకు సోషల్ మీడియా ట్వీట్ తో షేర్ చెయ్యడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పోస్ట్‌ను గమనించిన బెంగళూరు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవడం కోసం ఫిర్యాదును సంబంధిత పోలీసు అధికారులకు ఇవ్వాలని ఆమెకు మనవి చేశారు. రైల్వే మహిళా ప్రయాణికులు ఇబ్బంది పడిన సమయంలో అత్యవసర పరిస్థితుల్లో 112కు డయల్ చేయాలని బెంగళూరు పోలీసులు ప్రజలకు సూచించారు.
ప్లాట్‌ఫారమ్‌కు ఎదురుగా ఉన్న సెక్యూరిటీ గార్డు నిరంతరం నా వైపు చూస్తూ అసభ్యకరంగా సైగలు చేస్తున్నాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటన మార్చి 17వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటలకు జలహళ్లి మెట్రో రైల్వే స్టేషన్‌లో జరిగింది. మెట్రో సిబ్బంది సైగల ద్వారా నా వైపు చూస్తున్నారు. అందుకే వీడియోలు తీయడం మొదలుపెట్టాను. అప్పుడు వారు వెనక్కి తిరిగారని, ముఖం కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారని మహిళా ప్రయాణికురాలు ఆరోపించారు.
Disturbing scene at Jalahalli Metro Station: Staff blatantly leering at a girl & touching himself. Complaints ignored by metro authorities. Video proof attached. Video proof attached. @BlrCityPolice, urgent intervention needed! #StopHarassment #SafeCommute #SafetyFirst pic.twitter.com/jH5fV5rvuU
— Mohit Bishnoi (@Mohit_2507) March 19, 2024
మెట్రో రైలు ప్రయాణికురాలు ఆమె జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఫిర్యాదుతో పాటు ఆమె ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అది వైరల్ అయ్యింది. ఈ సంఘటన తనకు సురక్షితం కాదని భావించినందున సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బీఎంఆర్ సీఎల్ ను ఆమె కోరింది. ఈ విషయంపై బుధవారం బీఎంఆర్ సీఎల్ స్పందించింది. ఈ సంఘటనతో సెక్యూరిటీ గార్డు మీద దర్యాప్తు చేసి అతన్ని సస్పెండ్ చేశామని తెలిపారు. బీఎంఆర్ సీఎల్ మహిళా ప్రయాణీకుల భద్రత కల్పిస్తామని బీఎంఆర్ సీఎల్ అధికారులు తెలిపారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications