డిప్రెషన్‌‌లో శశికళ: జైల్లో క్షీణించిన ఆరోగ్యం, ఆస్తుల కోసం బంధువుల ఒత్తిడి!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివారల్లోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ నటరాజన్ ఆరోగ్యం క్షీణిస్తోందని వెలుగు చూసింది.

మానసిక ఒత్తిడి, తీవ్ర ఆవేదనతో వున్న శశికళ షుగర్ (చక్కెర) స్థాయిలు 440కు పెరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జైలుకు వెళ్లిన శశికళ 75 రోజుల్లో దాదాపు 14 కిలోలకు పైగా బరువు తగ్గినట్లు సమాచారం. శశికళ వదిన ఇళవరసి, ఆమె అక్క కుమారుడు సుధాకరన్ కూడా అదే పరప్పన అగ్రహార జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు.

బంధువులను దూరం పెట్టిన చిన్నమ్మ

బంధువులను దూరం పెట్టిన చిన్నమ్మ

గత కొంత కాలంగా శశికళ జైల్లో బంధువులను కలవడానికి ఇష్టపడటం లేదని వెలుగు చూసింది. శశికళకు అత్యంత సన్నిహితులు, అన్నాడీఎంకే పార్టీకి చెందిన నాయకులు (తమిళనాడు, బెంగళూరు) మాత్రమే ఆమెతో భేటీ అవుతున్నారని తెలిసింది.

ఆస్తుల కోసం ఒత్తిడి

ఆస్తుల కోసం ఒత్తిడి

ఇటీవల జైల్లో ఉన్న శశికళను ఆమె బంధువులు కలిశారు. ఆ సందర్బంలో శశికళ పేరు మీద ఉన్న ఆస్తులు తమ పేరు మీద రాయాలంటూ ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టారని వెలుగు చూసింది. అందుకే ఆమె బంధువులను దూరం పెట్టారని తెలిసింది.

విసిగిపోయిన చిన్నమ్మ

విసిగిపోయిన చిన్నమ్మ

ఆస్తులు వారి పేరు మీద రాయాలంటూ ఒత్తిడి తీసుకు వస్తున్న బంధువుల మీద శశికళ మండిపడ్డారని, ఆస్తులు వారి పేరు మీద రాయడం చిన్నమ్మకు ఇష్టం లేదని బెంగళూరుకు చెందిన ఆమెకు అత్యంత సన్నిహితుడైన అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) నాయకుడు తెలిపారు.

నా ఆరోగ్యం, బాగోగుల కాదని ఆస్తులా ?

నా ఆరోగ్యం, బాగోగుల కాదని ఆస్తులా ?

జైలు దగ్గరకు వచ్చిన బంధువులు తన ఆరోగ్యం, బాగోగుల గురించి అడగకుండా తన ఆధీనంలో ఉన్న ఆస్తులు అడుగుతుండటంతో చిన్నమ్మ అసహనం వ్యక్తం చేశారని, అదే విషయంలో మానసిక ఒత్తిడితో ఆరోగ్యానికి గురైనారని ఆమె సన్నిహిత నేత తెలిపారు.

బినామీల ఆస్తులు టార్గెట్

బినామీల ఆస్తులు టార్గెట్

బినామీల వద్ద ఉన్న ఆస్తులను టార్గెట్ చేసుకున్న శశికళల బంధువులు ఆ ఆస్తులు మొత్తం మాపేరు మీద రాయాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో చిన్నమ్మ డిప్రెషన్ లోకి వెళ్లారని జైలు సిబ్బంది చెప్పారని అన్నాడీఎంకే నేతలు అంటున్నారు.

దినకరన్ తిక్క చేష్టలతో

దినకరన్ తిక్క చేష్టలతో

ఇటీవల అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న పరిణామాలుకూడా శశికళను తీవ్రంగా కలవరుపరుస్తున్నాయని, తాను ఎంతో నమ్మిన అక్క కుమారుడు టీటీవీ దినకరన్ కారణంగా లేనిపోని సమస్యలు వచ్చిపడుతున్నాయని ఆమె ఆవేదన చెందుతున్నారని ఆమెను కలిసిన అన్నాడీఎంకే నేత అంటున్నారు.

పన్నీర్ వ్యవహారంతో

పన్నీర్ వ్యవహారంతో

శశికళను పార్టీ నుంచి బహిష్కరించినట్లు అధికారికంగా ప్రకటించనప్పటికీ ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీ నేతలు ఆమెను దూరం పెట్టారు. పన్నీర్ సెల్వం తన మీద పగపట్టి ఇలా చేయిస్తున్నారని శశికళ మానసిక ఒత్తిడికి గురై ఆవేదన చెందుతున్నారని సమాచారం.

పార్టీ పదవి నుంచి ఎవ్వరూ దూరం చెయ్యలేరు

పార్టీ పదవి నుంచి ఎవ్వరూ దూరం చెయ్యలేరు

జైలుకెళ్లే ముందు శశికళ జయలలిత సమాధి దగ్గరకు వెళ్లి శపథం చేశారు. తనని అధికారం నుంచి దూరం చేశారు కాని పార్టీ నుంచి ఎవ్వరూ దూరం చెయ్యలేరని, అది సాధ్యం కాదని అమ్మ సమాధి సాక్షిగా శశికళ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

పన్నీర్, పళని విలీనంతో !

పన్నీర్, పళని విలీనంతో !

పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాలు విలీనం అవుతున్నాయని తెలుసుకున్న శశికళ మనోవేదనకు గురైనారని, వీటన్నిటి నేపథ్యంలో ఆమె అనారోగ్యానికి గురై జైల్లో పెద్ద పెట్టున రోదిస్తున్నారని, అందుకే బంధువులను కలవడానికి ఇష్టపడటం లేదని జైలు వర్గాలు తెలిపాయని అన్నాడీఎంకే నేతలు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bengaluru Parappana Agrahara Central jail: VK Sasikala Natarajan health condition is very bad ?. Panneerselvam's faction for the party's two-leaf election symbol, which was eventually frozen by the Election Commission.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి