బెంగళూరు పేలుడు: వరంగల్‌కు కర్ణాటక పోలీసు బృందం

బెంగళూరు/హైదరాబాద్: బెంగుళూరులోని బ్రిగేడ్ రోడ్ సమీపంలోని చర్చి వీధిలో కోకోనట్ గ్రూప్ హోటల్ వెలుపల పాదచారుల మార్గంలో ఆదివారం రాత్రి జరిగిన బాంబు పేలుడుకు వరంగల్ జిల్లాకు సంబంధం ఉన్నట్లు బెంగళూరు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుళ్లలో తమిళనాడుకు చెందిన ఓ మహిళ మృతి చెందగా, మరో 9మంది తీవ్రగాయాలపాలైన విషయం తెలిసిందే.

బాంబు పేలుడు జరిగిన స్థలంలో వరంగల్ జిల్లాకు చెందిన న్యూస్ పేపర్ లభ్యం కావడంతో వరంగల్ జిల్లాకు చెందినవారికి పేలుడుకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు తర్వాత ప్రముఖ దినపత్రికకు చెందిన వరంగల్ జిల్లా టాబ్లాయిడ్‌ను పోలీసులు ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నారు. ఆ న్యూస్ పేపర్లోనే ఐఈడి బాంబును చుట్టి పెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Bengaluru police team in Warangal?

ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు పోలీసు బృందాలను పంపించారు. ఐఎస్ఐఎస్, సిమి లాంటి ఉగ్రవాద సంస్థలకు ఈ పేలుళ్లతో సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. పేలుడుకు ఐదు గంటల ముందే బాంబును తయారు చేసినట్లు పోలీసులు తేల్చారు. అయితే బాంబును బెంగళూరుకు సమీపంలోనే తయారు చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా బెంగళూరు పేలుడుతో వరంగల్‌కు ఎలాంటి సంబంధం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది.

కాగా, బెంగుళూరు బాంబు పేలుడు ఘటన ఖచ్చితంగా ఉగ్రవాద చర్యేనని కేంద్ర హోంశాఖ, కర్నాటక ప్రభుత్వం నిర్ధారణకు వచ్చాయి. ఈ ఘటనపై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీతో దర్యాప్తు జరిపించాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బాంబు పేలుడు ఘటనపై ఏ ఉగ్రవాద సంస్థ తామే బాధ్యులమంటూ ప్రకటించుకోలేదు.

బెంగుళూరు బాంబు పేలుడు కేసులో నిందితుడిని పట్టిస్తే నజరానా బెంగుళూరు బాంబు పేలుడు ఘటనపై ప్రభుత్వం స్పందించి దర్యాప్తును వేగవంతం చేసింది. బాంబు ఘటనలో నిందితుల వివరాలు అందించిన వారికి రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+