వర్షబీభత్సానికి ఒకరు బలి: హైదరాబాద్, విశాఖ విమానాలు మళ్లింపు
Bay of Bengal: బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం రెండు రాష్ట్రాలపై తీవ్రంగా పడింది. కర్ణాటక, తమిళనాడుల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు తడిచి ముద్ద అయ్యాయి.
శనివారం మధ్యాహ్నం బెంగళూరులో భారీ వర్షం కురిసింది. గంట పాటు దంచి కొట్టింది. ఆ తరువాత కూడా అడపా దడపా వర్షాలు పడ్డాయి. నగరవ్యాప్తంగా రాత్రి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఎంజీ రోడ్, ఇందిరానగర్, ఎలక్ట్రానిక్ సిటీ, జయనగర, హెబ్బాళ, సుల్తాన్ పాళ్య, ఆర్టీ నగర.. వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచాయి.

సహకార నగర, విద్యారణ్యపుర, యలహంక, జాలహళ్లి, సంజయ్ నగర్, భద్రప్ప లేఅవుట్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్.. వంటి ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. చిక్‌బళ్లాపురా, కోలార్, చామరాజనగర, మైసూర్, దక్షిణ కన్నడ.. వంటి జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు, మరి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.
ఈదురుగాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. బెంగళూరు వ్యాప్తంగా 30 చెట్లు కూకటివేళ్లతో సహా నేలకూలాయి. కాక్స్ బజార్ జీవన్‌హళ్లిలో చెట్టు కొమ్మలు విరిగిపడి బాలిక మరణించింది. శనివారం రాత్రి ఈస్ట్ పార్క్ మెయిన్ రోడ్ వద్ద ఈ దుర్ఘటన సంభవించింది.
ఆమె పేరు రక్ష. రాత్రి 8:30 గంటలకు ఆమె తండ్రి బైక్‌పై ఎక్కించుకుని బంధువుల ఇంటికి వెళ్తోన్న సమయంలో ఈస్ట్ పార్క్ మెయిన్ రోడ్ వద్ద చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో రక్షకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె తండ్రి స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే ఆ బాలికను బౌరింగ్ హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది.
వర్ష బీభత్సానికి 20 విమానాలను సైతం మళ్లించాల్సి వచ్చింది. ఇండిగో- 10, ఎయిరిండియా- 4, ఆకాశ- 2 విమానాలను మళ్లించినట్లు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వెల్లడించింది. మారిషస్, మాలీ, హైదరాబాద్, ముంబై, దుర్గాపూర్, గోవా, పోర్ట్‌బ్లెయిర్, షిర్డీ, తిరుచిరాపల్లి, ఢిల్లీ, విశాఖపట్నం, బగ్డోగ్రా, ఐజ్వాల్ నుంచి విమానాలను కోయంబత్తూరు, చెన్నైకి మళ్లించాల్సొచ్చింది.
#6ETravelAdvisory: Unfavourable weather conditions in #Bengaluru continue to impact flights. We're closely monitoring the weather & will keep you informed with timely updates. Check your flight status https://t.co/CjwsVzFWky & rebooking options here https://t.co/KpeDADNuCa. pic.twitter.com/SbhnmOBHfs
— IndiGo (@IndiGo6E) March 22, 2025
అటు తమిళనాడులోనూ ఈ ఆవర్తన ప్రభావం కనిపించింది. చెన్నై సహా పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. పుదుచ్చేరి, కరైకల్ సహా తమిళనాడు ఉత్తర ప్రాంత జల్లాలు తంజావూరు, తిరువారూరు, నాగపట్నం, మైలాడుథురై, పుదుక్కోట్టై, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యకుమారి జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.












Click it and Unblock the Notifications