Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అడవిలోకి నో ఎంట్రీ: స్నేహితులతో వెళ్లిన బెంగళూరు సీఈవో, చెయ్యిని తినేసిన మొసలి!

బెంగళూరు: దేవాలయం దగ్గరకు వెళ్లిన తరువాత నిషేధిత అటవి ప్రాంతంలోకి వెళ్లిన సమయంలో బెంగళూరు నగరంలోని స్టాట్ అప్ కంపెనీ సీఈవో ముదిత్ దండవత్ (27) అనే యువకుడి ఎడమ చేతిని మొసలి పూర్తిగా కొరికి తినేసిన ఘటన బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని రామనగర అటవి ప్రాంతంలో జరిగింది.

ఐఐటీ విద్యాభ్యాసం పూర్తి చేసిన ముదిత్ దండవత్ బెంగళూరులో స్టాట్ అప్ అనే కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి రామనగర సమీపంలోని అటవి ప్రాంతంలోని దేవాలయం దగ్గరకు వెళ్లారు. ఆలయంలో పూజలు పూర్తి చేసుకున్నారు.

అడవిలోకి నో ఎంట్రీ !

అడవిలోకి నో ఎంట్రీ !

తరువాత స్నేహితులు, రెండు పెంపుడు కుక్కలతో కలిసి అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వెలుతున్నారు. ఆ సమయంలో సమీపంలోని కొలనులోకి పెంపుడు కుక్కలు వెళ్లాయి. పెంపుడు కుక్కల వెంట ముదిత్ దండవత్ కూడా కొలను దగ్గరకు వెళ్లారు.

కుక్కల కోసం చెయ్యి పెట్టాడు !

కుక్కల కోసం చెయ్యి పెట్టాడు !

ఆ సమయంలో పెంపుడు కుక్కలను కొలనులో నుంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మొసలి ముదిత్ దండవత్ మీద దాడి చేసింది. అతని ఎడమ చేతిని నమిలి తినేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న ముదిత్ దండవత్ ను అతని స్నేహితులు, స్థానికుల సహాయంతో వెంటనే రామనగరలోని ఆసుపత్రికి తరలించారు.

చాన్స్ లేదు !

చాన్స్ లేదు !

రామనగరలో ప్రథమ చికిత్స చేయించిన తరువాత ముదిత్ దండవత్ ను బెంగళూరులోని హాస్ మ్యాట్ ఆసుపత్రికి తరలించారు. ముదిత్ దండవత్ ఎడమ చేతిని మొసలి పూర్తిగా నమిలి తినేసిందని, ఇప్పుడు ఆయనకు శాస్త్ర చికిత్స చేసి ఆ చేతిని అతికించడానికి ఆస్కారం లేదని వైద్యులు అంటున్నారు.

మొసలిని చూడలేదు

మొసలిని చూడలేదు

పెంపుడు కుక్కలను కొలనులో నుంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మొసలి వచ్చిన విషయం తాను గమనించలేదని ముదిత్ దండవత్ తన స్నేహితులకు చెప్పాడు. నిషేధిత అటవి ప్రాంతంలో ముదిత్ దండవత్ అక్రమంగా ప్రవేశించాడని వెలుగు చూసింది.

చెయ్యి పోయింది, ఇప్పుడు కేసు

చెయ్యి పోయింది, ఇప్పుడు కేసు

మదిత్ దండవత్ నిషేధిత అటవి ప్రాంతంలో ప్రవేశించాడని తమకు ఎవ్వరూ ఇప్పటి వరకు ఫిర్యాదు చెయ్యలేదని, అయితే అతని చేతిని మొసలి పూర్తిగా కొరికి తినేసిందని తమకు సమాచారం అందిందని, స్వయంప్రేరితంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని రామనగర జిల్లా ఎస్పీ పి.బి.రమేష్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+